కీర్తి సురేష్ మరో బయోపిక్ తో

టాలీవుడ్ లో మహానటి సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన హీరోయిన్ కీర్తి సురేష్. ఆమె తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు అప్పటి నుంచి ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఆమె ఎక్కడ కూడా కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్ దశలో ఉంది. తమిళం తెలుగులో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయినా సరే ఎక్కడ కూడా కంగారు లేకుండా ఆమె సినిమాలు చేస్తుంది. మన తెలుగు దర్శకులు కూడా ఆమెను ముందు ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కథలో నటనకు హీరోయిన్ కి ప్రాధాన్యత ఉంటే చాలు ఆమెను తీసుకోవాలి అని భావిస్తున్నారు. కథ ఎలా ఉన్నా సరే ఆమె నటన బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా చూసే అవకాశం టాలీవుడ్ జనాలకు ఉంటుంది అని అంటున్నారు. టాలీవుడ్ జనాలు ఆమె సినిమా ల మీద ఆసక్తి చూపించడం చూసి తమిళం వాళ్ళు కూడా ఎక్కువగా షాక్ అయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మన తెలుగులో ఆమె రెండు సినిమాలు చేస్తుంది. మహేష్ తో ఆఫర్ వచ్చినా సరే ఆమె చేయడానికి ఆసక్తి చూపించలేదు. మన తెలుగులో ఆమె సినిమా చెయ్యాలి అంటే ఇప్పుడు పారితోషికం కూడా ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నారు.

మన తెలుగు దర్శకులు కూడా ఆమె పాత్రల మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఒక తెలుగు హీరోయిన్ బయోపిక్ లో ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కృష్ణ భార్య… దివంగత విజయ నిర్మల జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను నరేష్ తీసుకుని రావాలి అని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అందుకే ఆమె ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు.