అప్పుడు కెసిఆర్.. ఇప్పుడు చంద్రబాబు.. సేమ్ టు సేమ్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాంటి పరిణామాలైతే చోటు చేసుకున్నాయో… ఇప్పుడు ఏపీ ఎలెక్షన్స్ టైంలో సరిగ్గా అవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. నాడు సిఎం కెసిఆర్ కేవలం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తే… నేడు చంద్రబాబును అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కెసిఆర్‌నే ప్రధానంగా టార్గెట్ చేసుకుని… జగన్‌ను ముందు నిలబెట్టి ఆయన తెరవెనుక చాలా తతంగాలు నడుపుతున్నారంటూ బాబు విమర్శిస్తున్నారు. ఒకసారి ఆ పోలికల్ని చూసుకుంటే…

– మహాకూటమిలోని నేతందరికీ అమరావతి నుంచే బీఫారాలు ఇస్తున్నారని, మహాకూటమిని గెలిపిస్తే అమరావతి నుంచి పరిపాలన సాగుతుందని అప్పట్లో కెసిఆర్ ఆరోపించారు. ఇక్కడ చంద్రబాబు సేమ్ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశాలతోనే జగన్‌ అభ్యర్థులకు బీఫారాలిస్తున్నారని.. వైసీపీ గెలిస్తే హైదరాబాద్‌ నుంచే పాలన సాగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు.
– తెలంగాణలో బలహీన ప్రభుత్వం కోసం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని కెసిఆర్ విమర్శిస్తే… అదే రీతిలో జగన్‌ను గెలిపించడం ద్వారా ఏపీలో బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కెసిఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ‘చంద్రబాబు మోచేతి నీళ్లు తాగాలా?’ అని నాడు కేసీఆర్‌ మండిపడితే… ‘కేసీఆర్‌కు బానిసలుగా బతకాలా’ అని నాడు చంద్రబాబు నిలదీస్తున్నారు.


– తెలంగాణకు బాబు తీవ్ర అన్యాయం చేశాడని చేశాడని కేసీఆర్‌ ఆరోపిస్తే… కేసీఆర్‌ ఆంధ్రకు అన్యాయం చేసేందుకే చూస్తున్నారని బాబు మండిపడుతున్నారు. ఇలా ఆరోపణలే కాదు.. వారి తనయుల విషయమై కూడా చర్చలు నడుస్తున్నాయి. అక్కడ కెటిఆర్, ఇక్కడ లోకేష్… ప్రాబల్యం అధికంగా ఉండే నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.