కౌశల్ సంచలన వీడియో.. వాళ్ళంతా కుక్కలు.. సోషల్ మీడియాలో వైరల్

తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఇదే షో కొందరిని తొక్కేయగా, మరికొందరిని మాత్రం ప్రేక్షకుల ముందు హీరోలను చేసింది. ఇలా పాపులర్ అయిన వాళ్లలో ప్రముఖ నటుడు కౌశల్ మండా ఒకరు. గత సంవత్సరం ‘స్టార్ మా’ చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ స్టార్ అయిపోయాడు. ఆ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది.

బిగ్‌బాస్ విన్నర్ అయినప్పటి నుంచి అడపాదడపా మీడియా ముందుకు వస్తున్న కౌశల్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బిగ్‌బాస్ సీజన్-2లో జరిగిన ఓ సంఘటనతో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసిన కౌశల్ ‘‘నేను నన్ను మాత్రమే నమ్ముతాను. అదే నా విజయ రహస్యం. నా వెనుక నుంచి మాట్లాడుకునే వాళ్ల గురించి నేనస్సలు పట్టించుకోను. కేవలం మీరు ఇది ఫాలో అయితే చాలు. జీవితంలో సక్సెస్ అయిపోవచ్చు” అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టు చూసిన తర్వాత దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు దీనిని సమర్ధిస్తుండగా, మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు. పోస్టు వరకు బాగానే ఉన్నా.. ఆ వీడియోలో కౌశల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అందులో నూతన్ నాయుడితో మాట్లాడుతూ.. కుక్కలు మొరిగితే పట్టించుకోను అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అప్పుడు ఏదో ప్రస్టేషన్‌లో మాట్లాడిన వ్యాఖ్యలను ఇప్పుడు షేర్ చేయడమేంటని తనీష్, గీతా మాధురి, బాబూ గోగినేని, దీప్తీ సునయన ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం కౌశల్ ఆర్మీ గురించి పెద్ద వివాదమే చెలరేగింది. కౌశల్ ఆర్మీ పేరిట తమ దగ్గర డబ్బులు వసూలు చేశాడని కొందరు మీడియా ముందుకు వచ్చారు. ఇది చిలికిచిలకి గాలి వానలా మారింది. ఆ తర్వాత ఈ వివాదం ఓ న్యూస్ చానెల్ వైపు మళ్లింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ముగిసిపోయింది.