కార్తి ఖైదీ రేర్ రికార్డ్.. కలెక్షన్స్ ఎంత రాబట్టిందో తెలిస్తే షాకే..?

డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తమిళ్ సూపర్ స్టార్ కార్తీ హీరోగా దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు, తమిళ్ భాషల్లో భారీగా విడుదలైన ఈ మూవీకి అన్నిచోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కల్ట్ క్లాసిక్ మూవీ, హీరోయిన్, పాటలు వంటి కమర్షియల్ అంశాలకు పోకుండా జెన్యూన్‌గా తీసిన సినిమా..

అంటూ ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి..మూడో వారంలోనూ అత్యధిక థియేటర్లలో నడుస్తోంది ఖైదీ..రీసెంట్‌గా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. విడుదలైన 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందీ చిత్రం.. కేరళలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ సినిమాల లిస్టులో మూడో స్ధానంలో ఉంది ‘ఖైదీ’. త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ రానుంది..