కంగనాకు షాకింగ్ రెమ్యూనిరేషన్.. అమ్మ కోసం నాలుగు గెటప్స్

తలైవి పేరుతో దర్శకుడు విజయ్ జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కంగన రౌనత్‌ నటించనుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రారంభం కావలసిన ఈ చిత్ర షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ‘తలైవి’లో కంగన నాలుగు గెటప్‌ల్లో నటించనుందని,

అందుకు సంబంధించి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్‌ జోసన్‌ కాలిన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున రూ.55 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కనుందని టాక్‌. దీంతో ఇందులో జయలలిత పాత్రను పోషించనున్న నటి కంగనారనౌత్‌ తన పారితోషికాన్ని రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.