కాజల్ ముద్దులు.. పబ్లిక్ గా వైరల్ అవుతున్న వీడియో..!

సినిమాలో నటిస్తే చాలు అని ప్రస్తుతం సినీ తారలు అనుకోవడం లేదు.. సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత సినిమా థియేటర్లలోకి వచ్చేవరకు ఆ సినిమా ప్రస్తుతం పనిలో హీరో, హీరోయిన్లు కష్టపడి మరి ప్రమోషన్స్ చేస్తుంటారు. ఎందుకంటే సినిమా హిట్ అయితే మాత్రం వాళ్ళ రేంజు, ఫెట్ మారుతుంది కాబట్టి. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాల ప్రమోషన్స్ అనే కొచం కొత్తగా మారాయి. హాయ్, హలో, నమస్తే బాగున్నారా అంటూ వచ్చి రాని తెలుగులో మాట్లాడే హీరోయిన్లు ప్రస్తుతం సినిమా కలెక్షన్ల కోసం కాస్త జోరు పెంచారు. సినిమాలలో హీరోలకు ఎలా ముద్దులతో ప్రేమను తెలుపుతారో, అదే మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానితో పబ్లిక్ లో బరితెగించిన హీరోయిన్స్ అని ట్రోల్స్ వేయించుకుంటున్నారు.

ఆ విషయానికొస్తే లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్.. అప్పటిలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కాగా, ఈమె ఈ మధ్య కాలంలో సక్సెస్ కి దూరంగా ఉందన్న విషయం తెలిసిందే. కొత్త హీరోయిన్లు వస్తున్నా కొద్దీ ఈ అమ్మడుకి అవకాశాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. దానితో ఈమె వాణిజ్య ప్రకటనలు చేస్తూ అడపాదడపా సినిమాలలో నటిస్తూ వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. చిరు రీ ఎంట్రీ తో వచ్చిన సినిమాతో హిట్ ని అందుకుంది. ఆ తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పెరుగుతున్న పోటీకి సినీ తారలు ప్రమోషన్స్ స్టయిల్ కూడా మార్చుకున్నారు. అదే ఫార్మలాను ఈ బ్యూటీ కూడా ఫాలో అవుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. రీసెంటుగా కాజల్ కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఆ తరువాత తన అందంతో అందరిని కట్టి పడేస్తున్న కాజల్ ఎం చేసినా కూడా అది సెన్సేషనల్ గా మారుతుంది అని మరో సారి ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది.

దాదాపుగా పదిహేనుఏళ్లుగా అగ్రతారల సరసం ఆడిపాడిన కాజల్ పారితోషికం పరంగా కూడా ఒక్కో సినిమాకు కోటిన్నర తీసుకుంటోంది కాజల్ అగర్వాల్. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా దూసుకుపోతుంది. ఇకపోతే ఫామ్ లో ఉన్నప్పుడు ఎంత అడిగినా ఓకే కానీ , ప్రస్తుతం ఆమె తక్కువ పారితోషికంతో చేస్తానన్న కూడా ఎవరు అవకాశాన్ని ఇవ్వడంలేదు. ఫ్యూచర్లో అయిన మంచి అవకాశలతో దూసుకుపోతుందేమో చూడాలి..