ఆందోళనలో రెబల్ ఫ్యాన్స్.. కృష్ణంరాజుకు తీవ్ర అస్వస్థత

సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. బుధవారం రాత్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణంరాజు వయస్సు 79 సంవత్సరాలు. బుధవారం అర్థరాత్రి సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం గమినించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరిశీలించిన డాక్టర్లు ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.గత కొంతకాలంగా కృష్ణంరాజు న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్నారు కృష్ణం రాజు.

బుధవారం రోజు రాత్రి సమయంలో శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు కేర్ ఆసుపత్రి డాక్టర్లు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రి సమయం కావడం, చలి తీవ్రత కారణంగా న్యుమోనియా సమస్య మరింత తీవ్రతరమైందని డాక్టర్లు అంటున్నారట. కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలుస్తోంది ఉదయాన్నే రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వస్తుండటం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రభాస్,కృష్ణంరాజు అభిమానులు ప్రార్థిస్తున్నారు.

కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఇతడు జనవరి 20, 1940న జన్మించాడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. నాకు నువ్వు నీకు నేను, పలనాటి పౌరుషం, రెబల్, అన్నా వదిన, కుటుంబ గౌరవం లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు.