జాన్వీకి లైన్ వేస్తున్న డాషింగ్ డైరెక్టర్.. వర్కౌట్ అవుతుందా..?

శ్రీదేవి అంటే పదహారేళ్ళ అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె తెలుగులో దాదాపుగా అరవైకి పైగా మూవీస్ చేసిన తరువాత హిందీ ఫీల్డ్ కి వెళ్ళింది. అక్కడ సెటిల్ అయిపోయింది. శ్రీదేవి ఇండియన్ క్వీన్ గా విపరీతమైన గ్లామర్ సంపాదించుకుంది. ఆమె ఓన్లీ వన్ నంబర్ వన్ స్టార్ గా కొన్నేళ్ళు ఏలింది. అందాల రాశిగా జగదేక సుందరిగా శ్రీదేవి బ్రాండ్ ఎవరికీ రాదు.

అటువంటి శ్రీదేవి తన కూతురుని వారసురాలిగా చూడాలనుకుంది. గత ఏడాది ఆమె అనూహ్యంగా దుబాయి హొటల్లో కన్నుమూసింది. శ్రీదేవికి తన కూతురిని టాలీవుడ్లో ఇంట్రడ్యూస్ చేద్దామని ఉంది. అయితే ఆ కోరిక తీరలేదు. కానీ ఇపుడు శ్రీదేవిని విపరీతంగా ఆరాధించే రాం గోపాల్ వర్మ శిష్యుడు, డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ద్వారా ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి పూరీ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మంచి స్మార్ట్ గా మారారు. ఆయన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తీస్తున్న ఫైటర్ మూవీ కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని గట్టిగా ట్రై చేస్తున్నాడుట. శ్రీదేవి కూతురు, విజయ్ కాంబో అయితే తన సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందని కమర్షిలల్ పల్స్ బాగా తెలిసిన పూరీ అంచనా వేసుకుంటున్నాడుట. అందుకోసం ఆయన హార్డ్ గా ట్రై చేస్తున్నాడని టాక్.

ఇక జాన్వీ కపూర్ కి తెలుగులో విజయ్ దేవర‌కొండ అంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే జాన్వీ తొలి సినిమా రౌడీతోనే అవుతుందని అంటున్నారు. జాన్వీ ఒకే అంటే పూరీ బూర్ల గంపలో పడినట్లేనని టాలీవుడ్లో కూడా వినిపిస్తోంది. మరి చూడాలి. జాన్వీ ఒకే అంటే మ్మురేపుతాడేమో.