సౌత్ ఇండ్రస్ట్రీ పై జాన్వీ కామెంట్…

అలనాటి అందాల తార శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. దక్షిణాది సినిమాల్లో నటించడం తన కల అంటోంది. ఇటీవల తాను మహానటి సినిమా చూసి అందులో లీనమైపోయిందట. ‘నేను క్లాసిక్స్ సినిమాలు బాగా చూస్తా. అవన్నీ మనం ఇప్పుడు చేస్తున్నవన్నీ వాటి ముందు తక్కువగానే అనిపిస్తాయి. నేను రింకూ రాజ్‌గురూ, కీర్తి సురేశ్ లకు పెద్ద ఫ్యాన్. అప్పుడప్పుడు కీర్తి సురేశ్ కు కాల్ చేసి ఏడ్చేస్తాను. ఎందుకంటే అది నిజమైన ప్రేమ”నా ఫోన్‌లో ప్లే లిస్ట్ కూడా దక్షిణాది సినిమావే ఉంటాయి. మణిరత్నం సినిమాలో మేకప్ లేకుండా నటించాలని ఉంటుంది. తెల్ల డ్రెస్ తో రెహమాన్ మ్యూజిక్ వస్తుంటే వాటర్ ఫాల్ దగ్గర డ్యాన్స్ చేయాలనుంటుంది. మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు దక్షిణాది భాషలు త్వరగానే నేర్చుకున్నా’

 

‘మా ఇంట్లో ఎప్పుడూ సినిమాలు గురించే చర్చలు జరిగేవి. సినిమాలు చూస్తూ గడిపేసేవాళ్లం. ఓ ఇంగ్లీషు సినిమా చూస్తున్నప్పుడు నాన్న (బోణీ కపూర్) ఇలా చెప్పారు. తను ఒక్కసారి మాత్రమే కెమెరా ముందు యాక్టింగ్ చేయలేదు. ఎప్పటికీ తన క్యారెక్టర్ నిలిచిపోయి ఉంటుంది’ అన్నారు.అవకాశం వస్తే కచ్చితంగా దక్షిణాది సినిమాలు చేస్తానంటోంది ఈ అమ్మడు. అంతేకాదు బాలీవుడ్ సినిమాలు కమర్షియల్ గా ఉంటాయి కానీ, కళాత్మకంగా ఉండవని పరోక్షంగా చెప్పుకొచ్చింది. ఈమె ఉద్దేశ్యం దక్షిణాదిలో సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తుంది కాబోలు. శ్రీ దేవీతో పోల్చుకుని చూస్తున్న అభిమానులకు అంతగా అలరించగలదా.. ఈ జాన్వీ.