జెనిలియా కి షాకింగ్ అఫర్…! ఒకే అవుతుందా

‘సత్యం’, ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’, ‘శశిరేఖా పరిణయం’… ఇలా ప‌లు తెలుగు చిత్రాల్లో అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో క‌నిపించి న‌టిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది జెనీలియా. పెళ్ళ‌య్యాక మ‌ళ్ళీ తెలుగు సినిమాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌ని ఈ టాలెంటెడ్ బ్యూటీ… తాజాగా ఓ మెగా ఆఫర్‌ను దక్కించుకున్నట్టు టాలీవుడ్ టాక్.ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్‌ మూవీ తెరకెక్క‌నున్న విషయం తెలిసిందే.

ఇద్దరు నాయిక‌లకు స్థాన‌మున్న ఈ చిత్రంలో… ఇప్పటికే చెన్నై బ్యూటీ త్రిషను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, మరో హీరోయిన్ గా జెనీలియా పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. కొంత చిలిపిదనం, మరికొంత కొంటెతనం కలసి ఉన్న ఆ పాత్రలో జెన్నీ అయితేనే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నార‌ట‌. త్వరలోనే జెన్నీ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో `హ్యాపీ`లోనూ, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి జంట‌గా `ఆరెంజ్‌`లోనూ జెనీలియా నాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి…చాన్నాళ్ళ త‌రువాత మెగా కాంపౌండ్ లో సినిమా చేయ‌బోతున్న జెన్నీ… రీ-ఎంట్రీ మూవీతో ఏ స్థాయిలో రంజింప‌జేస్తుందో చూడాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.