జబర్దస్త్ కు బిగ్ షాక్.. ఆ నలుగురు ఔట్.. నాగబాబు కూడా..!

ప్రస్తుతం ఈటీవీ ఛానెల్‌ టాప్‌లో ఉంది అంటే అది ఖచ్చితంగా జబర్దస్త్‌ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు.జబర్దస్త్‌ గురు శుక్రవారాల్లో రెండు ఎపిసోడ్స్‌గా ప్రసారం అవుతుంది.జబర్దస్త్‌ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కార్యక్రమాలకు మూల స్థంబాలుగా నాగబాబు, అనసూయ, సుడిగాలి సుధీర్‌ టీం మరియు హైపర్‌ ఆది టీం. ఈ నాలుగు స్థంబాలు ఈటీవీని వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ బుల్లి తెర వర్గాల వారు చెబుతున్నారు.

గత కొంత కాలంగా జబర్దస్త్‌ కామెడీ షో టాప్‌లో కొనసాగుతుంది.అందుకు ప్రధాన కారణం వీరు నలుగురు అనడంలో ఎలాంటి సందేహం లేదు.కాని ఇప్పుడు పరిస్థితి తారు మారు అయ్యేలా ఉంది.వీరు జబర్దస్త్‌ను వదిలేస్తారనే టాక్‌ వస్తుంది.ఎందుకు వదిలేస్తారు అనేది మీ ప్రశ్న అయితే ఆ సమాధానం కూడా మీకు కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థం అవుతుంది.ఎవరైనా జాబ్‌ మారాలని అనుకున్నప్పుడు ప్రధాన కారణం సాలరీ ఎక్కువ ఉండటం.అలాగే మల్లెమాల వాళ్లు ఇచ్చే పారితోషికం కంటే ఎక్కువగా వీళ్లకు ఇస్తామంటే ఎందుకు వదలరు చెప్పండి.జీ తెలుగు వారు త్వరలో ప్రారంభించబోతున్న ఒక కామెడీ షోకు ఈ నాలుగు పిల్లర్లు బాసటగా నిలవబోతున్నాయట.

భారీ పారితోషికాలను ఆఫరన చేసి జీ సంస్థ వారు వారిని ఆహ్వానిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.త్వరలోనే జీ తెలుగులో ఈ నాలుగు సంస్థలు కనిపిస్తాయంటున్నారు.మరి వీరు లేకుండా జబర్దస్త్‌ పరిస్థితి ఏంటీ అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.