జబర్దస్త్ నటి సీక్రేట్ మ్యారేజ్..

ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని వీడియోలతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ వీడియోల్లో ప్రియాంక సింగ్ మెడలో పసుపు తాడు ఉండడం, చేతులకు పెళ్లి కూతురులా గోరింటాకు పెట్టుకోవడం చూసి.. ఆమెకు పెళ్లయిందని భావిస్తున్నారు. బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న జబర్దస్త్ కామెడీ షో తెలుగు టెలివిజన్ రంగంలో ఓ సంచలనం..! ఈ కామెడీ షో టీఆర్‌పీ రేటింగ్‌లో మరే షోకు అందనంత స్థాయిలో టాప్‌లో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ సంపాదించుకున్న జబర్దస్త్ షోపై అంతే స్థాయిలో పుకార్లు వస్తుంటాయి. జబర్దస్త్ నటులు, యాంకర్స్‌పై రోజుకో వార్త షికారు చేస్తుంటుంది. ఇందులో కొన్ని నిజాలున్నప్పటికీ .. ఎక్కువ మాత్రం పుకార్లే ఉంటాయి. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సాయితేజ అలియాస్ పింకీకి పెళ్లయిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈమె సీక్రెట్‌గా పెళ్లయిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్‌లో ఒకప్పుడు చాలా స్కిట్స్ చేసిన సాయితేజ.. ప్రస్తుతం ఆ షోకు దూరంగా ఉంది. లేడీ గెటప్స్‌తో పాపులరైన సాయితేజ.. ఆ తర్వాత నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. జెండర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకొని యువతిగా మారాడు. తన పేరును ప్రియాంక సింగ్‌గా మార్చుకొని.. ఆరోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది. ఐతే టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండే పింకీ.. ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని వీడియోలతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ వీడియోల్లో ప్రియాంక సింగ్ మెడలో పసుపు తాడు ఉండడం, చేతులకు పెళ్లి కూతురులా గోరింటాకు పెట్టుకోవడం చూసి.. ఆమెకు పెళ్లయిందని భావిస్తున్నారు.

ఈ ప్రచారంపై స్వయంగా పింకీయే క్లారిటీ ఇచ్చింది. తనకు పెళ్లయిందన్న ప్రచారంలో నిజంలేదని.. విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్లినప్పుడు పూజారి ఇచ్చిన పసుపు తాడును ధరించానని.. అంతేతప్ప అది మంగళసూత్రం కాదని స్పష్టం చేసింది. తాను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని వెల్లడించింది.