జాను దుమ్ము దులిపిందిగా… ఎక్కడంటే…?

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీ ఆ సినిమా అక్కడ రిలీజ్ అవడానికి ముందే దిల్ రాజు చూసి రీమేక్ రైట్స్ కొనేశాడు. అనుకున్నట్టుగానే సినిమా అక్కడ సూపర్ హిట్ అవగా తెలుగులో రీమేక్ కు కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమా తెలుగు వర్షన్ లో శర్వానంద్, సమంత నటించడం జరిగింది, మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన జాను కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. సినిమాలో శర్వా, సామ్ తమ నటనతో మెప్పించిన సినిమాకు వసూళ్లు రాలేదు.

బి,సి సెంటర్స్ లో అయితే సినిమా దారుణంగా వసూళ్లు రాబట్టింది.దిల్ రాజు నమ్మకం మరోసారి ఒమ్ము చేశారు ఆడియెన్స్. అయితే రీసెంట్ గా లాక్ డౌన్ టైం లో ఈ సినిమా స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. విచిత్రం ఏంటంటే థియేటర్ లో చూడని ప్రేక్షకులు ఈ సినిమాను బుల్లితెర మీద చూసి ఎంజాయ్ చేశారు. ఈ సినిమాకు 7. టి.వి.ఆర్ పాయింట్స్ రావడం జరిగింది. అంటే దాదాపుగా 6152 ఇంప్రెషన్స్ అన్నమాట. ఈ లాక్ డౌన్ టైం జానుకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. న్యూస్ ఛానెల్స్ సైతం టి.ఆర్.ఫై రేటింగ్స్ పడిపోతున్న ఇలాంటి టైం ఓ జాను స్టార్ మాని మళ్ళీ నిలబెట్టింది.ఈటివి తెలుగు న్యూస్ బులిటెన్స్ గత రెండు మూడు వారాలుగా టాప్ రేటింగ్స్ లో దూసుకెళ్తుండగా జాను వాటిని క్రాస్ చేయడం విశేషం.

సిల్వర్ స్క్రీన్ పై హిట్ దక్కించుకొని ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై మాత్రం ప్రేక్షకులను అలరించింది చెప్పొచ్చు. ఈ సినిమా రీమేక్ చేసిన దిల్ రాజు మూవీ రీమేక్ చేసినందుకు ఇప్పటికైనా సంతోషపడతాడని చెప్పొచ్చు.