ఇస్మార్ట్ కు గట్టిదెబ్బ.. మొదటిరోజే ఇంత దారుణమా..!

ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయిక లో రూపొందిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఇస్మార్ట్ శంకర్. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న హీరో రామ్ కు అలానే దర్శకుడు పూరికి సూపర్ సక్సెస్ ని అందించిన ఈ సినిమా, ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. హీరోని తదైన మాస్ స్టయిల్లో చూపించే పూరి, ఈ సినిమాలో కూడా రామ్ ని ఆకట్టుకునే మాస్ స్టైల్ తో చూపించి మంచి మార్కులు కొట్టేసారు. ఇక డ్యాన్సింగ్ మరియు యాక్షన్ సీన్స్ అలానే తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు పలకడం వంటి అంశాల్లో రామ్ కూడా అదరగొట్టాడు అనే చెప్పాలి.
ఇక ఈ సినిమా అన్ని కేంద్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుండడం, మరీ ముఖ్యంగా బి, సి సెంటర్ల ఆడియన్స్ ని మరింతగా మెప్పిస్తుండడంతో ఇస్మార్ట్ శంకర్ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక యువత మరియు మాస్ ప్రేక్షకులు అయితే సినిమాను ఎంతో ఇష్టపడుతున్నారని, తాను సినిమా షూటింగ్ మొదలెట్టిన సమయంలోనే ఈ సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందని భావించినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పూరి చెప్పడం జరిగింది. ఇకపోతే అన్ని సినిమాల మాదిరి ఈ సినిమాకు కూడా అప్పుడే ఒక పెను ముప్పు మొదలయింది. అదే పైరసీ, ఇటీవల వరుసగా దేశవ్యాప్తంగా అన్ని సినిమాలను విడుదలైన వెంటనే పైరేటెడ్ ప్రింట్ రూపంలో తమ సైట్ లో పెడుతున్న ఒక ప్రముఖ సంస్థ, ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రింట్ ను కూడా నిన్న వారి సైట్ లో రిలీజ్ చేసిందట. అయితే సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ సైట్ ద్వారా విపరీతంగా సినిమాను డౌన్ లోడ్ చేసుకుని చూసేయడం మొదలెట్టారట వీక్షకులు.ఈ విధంగా పైరేటెడ్ ప్రింట్ కొనసాగితే తమ సినిమా కలెక్షన్లకు పెద్ద దెబ్బ పడడం ఖాయమని భావించిన సినిమా యూనిట్,
అతి త్వరలో దానిపై చర్యలు తీసుకునేందుకు అన్ని విధాలా సిద్దమైనట్లు సమాచారం. నిజానికి ఈ పైరసీ భూతం అనేది హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని సినిమాలకు తప్పని పెను సమస్యగా పరిణమించిందని, మన ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి వీటిపై గట్టిగా చర్యలు చేపడితేనేగాని సినిమాలు తీసేవారు బ్రతకలేని పరిస్థితని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…….!!