షాకింగ్.. ఢీ షో నుండి ప్రదీప్ తప్పుకోవడానికి అసలు రీజన్ ఇదేనా..?

తెలుగు బుల్లి తెర చరిత్రలోనే ఒక రియాలిటీ డాన్స్ షో 11 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు “ఢీ ఛాంపియన్స్”గా 12 వ సీజన్లోకి అడుగు పెట్టి విజయవంతంగా కొనసాగుతుంది.”ఢీ 10” నుంచి ఇప్పుడు “ఢీ ఛాంపియన్స్” వరకు మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న యాంకర్ ప్రదీప్ గత మూడు వారాల నుంచి కనిపించడం లేదు.ప్రదీప్ స్థానంలో రవి కనిపించారు.దీనితో షో వీక్షకుల్లో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే దీనికి కారణం ప్రదీప్ కు కొన్ని వ్యక్తిగత పనులు ఉండడం వల్ల ఈ ఢీ ఛాంపియన్స్ కు దూరం అయ్యినట్టు తెలుస్తుంది.మరి ఇప్పుడు ప్రదీప్ రీఎంట్రీ ఉందా లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.ప్రదీప్ ఇంకొన్ని ఎపిసోడ్ ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఖరారు అయ్యినట్టు సమాచారం.మరి ప్రదీప్ ఎప్పుడు ఢీ స్టేజ్ పై అడుగు పెడతారో చూడాలి.