ఆ ముగ్గురిలో ఒకరికి బిగ్ బాస్ టైటిల్ రాకపోవడానికి అదొక్కటే కారణమా..?

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ మూడవ సీజన్ కూడా ఎంతో ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ముగిసిపోయింది.అయితే మొదటి రెండు సీజన్లతో పోల్చినట్లయితే ఈ సీజన్లో ఉన్న ఫైనల్ కంటెస్టెంట్స్ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోలేదు.వెలుగులో లేని రాహుల్ మెల్లగా లైమ్ లైట్ లోకి వచ్చి టైటిల్ ఎగరేసుకెళ్లాడు.అయితే రెండో సీజన్లో వార్ వన్ సైడ్ అయ్యింది.అలాగే ఈ సీజన్ కూడా అవుతుందని అంతా అనుకున్నారు కానీ ఫైనల్స్ లో నిలబడ్డ వారు మాత్రం ఒక్కొక్కరూ ఒక్కొక్కరికి గట్టి పోటీ ఇచ్చారు.

అలాగే ఎవరి మీద ఉండాల్సిన నెగిటివిటీ కూడా ఉంది.కాకపోతే ఇప్పుడు ఇప్పటి దాకా ఈ షోను ఫాలో అయిన వారు మాత్రం టైటిల్ విన్నర్ రాహుల్ ను పక్కన పెట్టేసి మిగతా వారికి ఎందుకు టైటిల్ రాలేదో చెప్తున్నారు.టాప్ 5 లో ఉన్న అలీ ను పక్కన పెడితే ఓటింగ్ ఓ భీభత్సమైన పోటీ నెలకొంది మాత్రం శ్రీముఖి,బాబా మరియు వరుణ్ లకు అని చెప్పాలి.వీరిలో బాబా మోస్ట్ ఎంటర్టైనర్ శ్రీముఖి స్ట్రాంగ్ విమెన్ అలాగే వరుణ్ చాలా బాధ్యతగా నడుచుకొంటాడు కానీ ఇవేవి వీరిని టైటిల్ విన్నింగ్ దగ్గరకు తీసుకురాలేకపోయాయి.దానికి కారణం సింపతీ అని ఇదే వీరికి లేదని అందుకే వీరిలో ఎవరికీ టైటిల్ దక్కలేదని అంటున్నారు.