పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉండటానికి అదే కారణమా..?

పూనమ్ కౌర్..ఈమె చేసిన సినిమాల కన్నా..సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ట్వీట్స్ అమ్మడికి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాయి. ముఖ్యం గా పవన్ కళ్యాణ్ వ్యవహారం లో ఈమె పేరు పెట్టకుండా పవన్ అర్ధం వచ్చేలా చేసే కామెంట్స్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంటాయి. అయితే ఈమె సోషల్ మీడియా లో ఉన్నంత యాక్టివ్ గా సినిమాలు ఎందుకు చేయడం లేదనేది అందరిలో కలుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు పూనమ్ క్లారిటీ ఇచ్చింది.

తనకు పెళ్లి చేసుకోవాలని ఉందట. పిల్లల్ని కని త్వరగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారట. అందుకే సినిమాలకు సంతకం చేయడంలేదని తెలిపింది. ‘నాకు అవకాశాలు వస్తున్నా కూడా నేనే సంతకం చేయడంలేదు. ఎందుకంటే నాకు ఇక పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లల్ని కనాలని ఉంది. నాకంటూ ఓ కుటుంబం ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ కర్తార్‌పూర్ కారిడర్ ఆవిష్కరణకు వెళ్లడం జరిగింది. ప్రధాని మోడీ దీనిని ఆవిష్కరించనున్నారు.