కమల్ అమెతో రిలేషన్ లో ఉన్నాడా..? నెట్టింట్లో వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్

లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పటికే ముగ్గురు నటీమణులతో కలిసి జీవించాడు. ఇప్పుడు నాలుగో హీరోయిన్ కూడా అతడి లైఫ్ లోకి వచ్చిందని అంటున్నారు. 1978లో వాణి గణపతి అనే నటిని పెళ్లి చేసుకున్న కమల్ ఆమె నుండి విడిపోయి సారిక అనే మరో నటిని పెళ్లాడాడు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె నుండి కూడా విడిపోయాడు.ఆ తరువాత కొన్నేళ్లపాటు నటి గౌతమీతో సహజీవనం చేశాడు. ఈ మధ్య గౌతమితో కూడా విడిపోయాడు. ఇప్పుడు హీరోయిన్ తో కమల్ డేట్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆమెమరెవరో కాదు పూజా కుమార్. కమల్ హాసన్ తో కలిసి ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం 2’ వంటి చిత్రాలలో నటించింది పూజా కుమార్. భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ నటిని ఇండియాకు తీసుకొచ్చింది కమలే.

వరుసగా పూజాతో సినిమాలు చేస్తున్నపుడే ఆమెతో కమల్ బంధం మీద రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ అప్పటికి గౌతమితో సహజీవనంలో ఉన్నాడు. గౌతమితో విడిపోయిన తరువాత కమల్.. పూజకి దగ్గరయ్యాడని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారని వార్తలొచ్చాయి. తాజాగా కమల్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చాయి.అందులో కమల్ అన్నయ్య చారుహాసన్ సహా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. కమల్ ఇద్దరు కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ కూడా ఉన్నారు. పూర్తిగా కమల్ కుటుంబ సభ్యులతో నిండిన ఈ ఫొటోలో పూజా కుమార్ కనిపించి షాకిచ్చింది. ఈ ఫోటో మరిన్ని సందేహాలకు తావిస్తోంది. పూజాతో కమల్ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నా ఇంకా వారి బంధం కొనసాగడంతో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పైగా ఫ్యామిలీ ఫోటోలో ఆమెకి చోటు ఇవ్వడంతో ఇండస్ట్రీ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కమల్ హాసన్ ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. అయితే కొందరు మాత్రం పూజ..కమల్ హాసన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ప్రొడక్షన్ హౌస్‌తోకలిసి పని చేస్తుందని.. ఆ కారణంగానే కమల్ వెన్నంటే ఉంటుందని అంటున్నారు. అలా అయితే సినిమాల వరకు ఉంటే సరిపోతుంది కదా.. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై పూజ కానీ కమల్ కానీ స్పందిస్తారేమో చూడాలి!