ఇంత జరిగిందా..? డేటింగ్ యాప్ తో ఇబ్బందులు పడుతున్న కియారా..!

‘కబీర్‌ సింగ్‌’తో బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న కైరా అద్వానీ ప్రస్తుతం ఐదు ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఓ వైపు ముంబయిలో జరుగుతున్న ‘గుడ్‌ న్యూస్‌’ షూటింగ్‌లో, మరోవైపు లక్నోలో జరుగుతున్న ‘ఇందూ కి జవానీ’ చిత్రీకరణలో పాల్గొంటోంది. మధ్యలో వచ్చే గ్యాప్‌లో ‘లక్ష్మిబాంబ్‌’, ‘షేర్షా’, ‘భూల్‌ భులైయ్యా 2’ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా క్రేజీ హీరోయిన్‌గా కైరా తన డిమాండ్ ని ఎంజాయ్ చేస్తోంది.వీటిల్లో ‘ఇందూ కి జవానీ’ లేడీ ఓరియంటెడ్‌ చిత్రం కావడం విశేషం.ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ వల్ల ఓ అమ్మాయి ఎలాంటి కష్టాలు పడిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది.నిజమైన ప్రేమ కోసం ఇందూ అనే అమ్మాయి పడే ఇబ్బందులు ఇందులో వినోదాత్మకంగా చూపించబోతున్నారు.

ఈ కమింగ్‌ ఏజ్‌ కామెడీ చిత్రానికి అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఇటీవల లక్నోలో ప్రారంభమై మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. అందులో కైరా పాల్గొన్నారు. మధ్యలో ఆమె నటిస్తున్న ‘గుడ్‌న్యూస్‌’ కోసం ముంబయి వచ్చారు. ఇందులో ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. అది పూర్తి కావడంతో ఇప్పుడు తిరిగి లక్నోలో జరుగుతున్న ‘ఇందూ కి జవానీ’ రెండో షెడ్యూల్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని కైరా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ‘కమ్‌ బ్యాక్‌ టు లక్నో. ‘ఇందూ కి జవానీ’ ప్రారంభమైంది’ అని పేర్కొంటూ ఓ వీడియోని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది.వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుంది. వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. బాక్సర్‌కు జోడీగా కియారా అద్వానీ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాను అల్లు వెంకటేశ్, సిద్ధు నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.