సూపర్ అఫ్ డేట్స్.. వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్లు..?

వాట్సాప్.. ప్రపంచంలో నెంబర్ వన్ మెసేజింగ్‌ యాప్‌.. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ వాట్సప్ లేకుండా ఇప్పడు చాలా మందికి రోజు గడవదు. మిగిలిన కొన్ని యాప్స్ లా ఇది ఎంటర్ టైన్ మెంట్ కాదు..చివరకు ఆఫీసు పనుల కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు చాలా వరకూ వాట్సప్ పైనే జరుగుతోంది.బంధువులు, స్నేహితులు, కొలీగ్స్, ఆఫీసు వ్యవహారాలు అన్నింటికీ.. ఒక్కో గ్రూప్.. అలా అందరినీ అలరిస్తున్న వాట్సప్ ఇప్పుడు మరింత అద్భుతంగా తన వినియోగదారులను అలరించబోతోంది. కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అవేంటో చూద్దాం..ఇప్పటి వరకూ ఒక ఫోన్‌ నంబరుతో ఒకే ఫోన్‌లో వాట్సప్‌ వాడే అవకాశముంది.

అయితే ఇదే నంబరుతో మరో ఫోన్‌లో లాగిన్‌ అయ్యేందుకు కుదరదు.. మహా అయితే.. కేవలం వాట్సప్‌ వెబ్‌లో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కానీ త్వరలో ఆ ఇబ్బంది తొలగిపోనుంది. ఇప్పుడు ఒకే నంబరుపై వేరు వేరు ఫోన్లలో ఒకే సారి వాట్సప్‌ వాడుకొనేలా మార్పు చేస్తున్నారు.ప్రస్తుతం దీని బీటా వెర్షన్ నడుస్తోంది. ముందుగా ఈ సౌకర్యం ఐఓఎస్‌లో అందుబాటులోకి తెస్తారట. ఆ తర్వాత ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో చేరుస్తారట. ఇక మరో సౌకర్యం.. గూగుల్‌ అసిస్టెంట్‌ నుంచి వాట్సప్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవడం.. ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం గూగుల్‌ అసిస్టెంట్‌ తెరిచి వాట్సప్‌ నుంచి వాయిస్‌, వీడియో కాల్‌ చేసుకొనే సౌకర్యం త్వరలో రాబోతోందట.ఇక మరో అద్భుతమైన ఫీచర్.. డెస్క్‌టాప్‌లోనూ ఆల్బమ్‌ ఏర్పాటు చేసుకునే సౌకర్యం..

ఇప్పటి వరకూ ఎవరైనా కొన్ని ఫోటోలు, వీడియోలు పంపితే అవి ఛాట్‌ హిస్టరీలో ఒక ఆల్బమ్‌లా కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్‌ ప్రస్తుతం డెస్క్‌టాప్‌లో లేదు. ఒక ఫోటో కింద మరో ఫోటో వరుసగా కనిపిస్తున్నాయి. వాట్సప్‌ వెబ్‌లోనూ ఆల్బమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. దీంతో పాటు ఐఫోన్‌ వినియోగదారుల కోసం వాట్సప్‌ ఆడియో ప్లే బ్యాక్‌ ఫీచర్‌ కూడా అందుబాటులోకి రాబోతోంది.