నా పెళ్ళి జరిగేది అక్కడే.. జాన్వీ కపూర్ సంచలన ప్రకటన

శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే అదరగొట్టింది. ఇక ఆమె తరువాత వరసగా మూవీస్ బాలీవుడ్లోనే చేస్తూంటే శ్రీదేవికి పుట్టింటి లాంటి టాలీవుడ్ ని మరచిపోయిందా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే అటువంటిదేమీ లేదు, మంచి కధ పడితే టాలీవుడ్లో జాన్వీ మూవీ చేస్తుందని ఆమె తండ్రి బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక శ్రీదేవికి దక్షిణాది అంటే ప్రాణం. ఆమె ఎపుడూ ఇక్కడికే వస్తూంటారు.అలాగే తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు రావడాన్ని కూడా అలవాటు చేసుకున్నారు.

ఇపుడు అదే సంప్రదాయాన్ని కుటుంబం కూడా కొనసాగిస్తోంది. తనకు కూడా తిరుపతి బాగా ఇష్టమని జాన్వీ చెబుతోంది. తిరుపతి వెంకన్నదర్శనం కోసం ఇకపై ప్రతీ ఏడాది తాను వస్తానని కూడా జాన్వీ చెబుతోంది. ఇక తన పెళ్ళి గురించి కూడా ఆమె చెప్పేసింది. తనది పూర్తిగా సంప్రదాయబధ్ధమైన పెళ్ళిలా జరుగుతుందని జాన్వీ చెప్పుకొచ్చింది. పైగా తిరుపతిలోనే తన పెళ్ళి ఉంటుందని కూడా వెల్లడించింది. తన పెళ్ళి అట్టహాసంగా చేసుకోవాలనుకోవడం లేదని, తిరుపతిలో చేసుకుంటే అదే గొప్ప‌ వేడుక అని వెల్లడించింది.ఇక తన పెళ్ళిలో భోజనం కూడా పూర్తి సంప్రదాయంగా ఉండాలని జాన్వీ అంటోంది. పూర్తిగా దక్షిణాది వంటకాలతో పెళ్ళి భోజనం అదిరిపోతుందని చెబుతోంది. ఇడ్లీ, సాంబార్, పాయసం, పెరుగన్నం వంటివి స్పెషల్స్ అంటోంది.

ఇక పెళ్ళిలో కాంజీవరం పట్టుచీర కట్టుకుంటానని కూడా చెబుతోంది..మొత్తానికి శ్రీదేవి కూతురుకు కి పెద్ద ఆశలే ఉన్నాయి. ఇక తల్లి సొంత వూరు, బంధువులు ఉన్న తిరుపతి అంటే కూడా జాన్వీ ఇష్టపడడం చూస్తూంటే ఈ ముద్దు గుమ్మ తొందరలోనే టాలీవుడ్లో ఎంట్రీకి రెడీ అయినట్లేనని అంటున్నారు. సో జాన్వీ కపూర్ శ్రీదేవి లేని లోటు తీరుస్తుందని భావించాలి