బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఏవరంటే..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 12 వ వారంలోకి అడుగుపెట్టింది, మొన్నటి వారం హౌస్ నుండి పునర్నవి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి వెళ్ళిపోయింది. దీనితో హౌస్ లో రాహుల్, మహేష్, వరుణ్, అలీ,బాబా భాస్కర్,వితిక,శ్రీముఖి,శివజ్యోతి మాత్రమే ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ ఈ వారం ఎలిమినేషన్స్ కోసం నామినేషన్స్ జరిగాయి. సేఫ్ పార్కింగ్ అంటూ జరిగిన ఈ టాస్క్ లో గార్డెన్ ఏరియాలో ఎనిమిది ట్రాలీలు ఉంటాయి, అక్కడ ఏడూ మాత్రమే పార్కింగ్ ప్లేసులు ఉంటాయి, ఎవరైతే పార్కింగ్ పెట్టకుండా చివరికి మిగులుతారో వాళ్ళు ఈ వారం నామినేట్ అయ్యినట్లు .

ఈ క్రమంలో వరుణ్, వితిక ముందు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత మహేష్, రాహుల్ కూడా నామినేట్ కావటం జరిగింది. ఈ టాస్క్ లో శివజ్యోతికి గాయం కావటంతో హౌస్ కాసేపు గందరగోళం జరిగింది, అయితే వెంటనే ఆమెకి వైద్య సహాయం అందించారు. ఇక నామినేట్ అయిన వాళ్లలో వితికకి మోడలియన్ టైటిల్ ఉండటంతో దానిని ఉపయోగించుకొని ఈ వారం ఆమె సేఫ్ అయ్యింది. దీనితో మహేష్,వరుణ్,రాహుల్ మాత్రమే మిగిలారు. విశేషం ఏమిటంటే గతం వారం కూడా వీళ్లే నామినేట్ అయ్యారు, వాళ్లతో పాటుగా పునర్నవి అయ్యింది. ఆమె గత వారం వెళ్ళిపోయింది.