బిగ్ బాస్ మూడు సీజన్స్ లో ఏది బెస్టో తెలుసా..? టీఆర్పీ రేటింగ్స్ తో తేలిపోయిందిగా..?

తెలుగు బుల్లితెర పై తిరుగులేని రియాల్టీ షోగా పేరుగాంచిన షో ‘బిగ్ బాస్’. టీఆర్పీ రేటింగ్స్ లో కూడా ఈ ‘షో’ ఇప్పటికే అద్భుతమైన రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. అయితే మూడు సీజన్స్ లో ఏ సీజన్ కి, ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చిందో పరిశీలిస్తే.. ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ తొలి సీజన్ మొదటి ఎపిసోడ్ కి 16.18 రేటింగ్ రాగా, నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్-2 తొలి ఎపిసోడ్ కి కేవలం 15.05 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే, నాగార్జున హోస్ట్ గా వచ్చిన మూడో సీజన్‌ కు మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ కి ఏకంగా 17.9 రేటింగ్‌ వచ్చింది. ఇలా మూడు సీజన్స్ మొదటి ఎపిసోడ్ ల మాదిరిగానే.. మిగిలిన అన్ని ఎపిసోడ్స్ కూడా ఇంచుమించుగా అలాగే సాగాయి.

కానీ ఒక్కో వారం మాత్రం.. మొదటి సీజన్ కు వచ్చిన రేటింగ్ ను రెండు, మూడు సీజన్స్ కూడా బీట్ చెయ్యలేకపోయాయి. కాకపోతే ఓవరాల్ గా రేటింగ్స్ ప్రకారం చూసుకుంటే.. బిగ్ బాస్ మొదటి సీజన్ కంటే, రేటింగ్ సాధించడంలో రెండవ సీజన్ బాగా వెనుకబడింది. ముఖ్యంగా వీక్ డేస్ లో బిగ్ బాస్ 2 సీజన్ సగటున 7.93 రేటింగ్ సాధించగా… బిగ్ బాస్ మొదటి సీజన్ సగటున 9.24 రేటింగ్ సాధించడం విశేషం. ఇక మూడో సీజన్ మాత్రం రేటింగ్ లో మొదటి సీజన్ ను బీట్ చేసిందని తెలుస్తోంది.ఇక హోస్ట్ గా మాత్రం ఎన్టీఆర్, నాని, నాగ్ లలో ఎన్టీఆరే బెస్ట్ అని… ఎన్టీఆర్ ను మాత్రం ఎవ్వరూ బీట్ చేయలేకపోయారని.. ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.ఇక తరువాత సీజన్ హోస్ట్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4కి హోస్ట్ గా మెగాస్టార్ చేస్తున్నారని.. అందుకే సీజన్ 3 ఫైనల్ కు చిరంజీవి వచ్చారని ఆ రూమర్స్ సారాంశం. మరి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ షోకి మెగాస్టార్ హోస్ట్ గా చేస్తే మాత్రం వచ్చే సీజన్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం.