అల.. వైకుంఠపురములో పై షాకింగ్ రూమర్స్.. బన్నీకి అదే మైనస్ అవ్వనుందా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన సాధించడంతో పాటు, ఇటీవల సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన ఈ సినిమాలోని రెండు లిరికల్ సాంగ్స్ కు యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ ని దక్కించుకుని సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేసాయి. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, మురళి శర్మ, సునీల్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా కూడా గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి మాదిరిగా ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతోందని టాక్. ఇక బన్నీకి తండ్రిగా మురళి శర్మ నటిస్తున్న ఈ సినిమాలో టబు, బన్నీ సోదరిగా నటిస్తోందట. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఎంటర్టైన్మెంట్ తో సాగిన ఈ సినిమా, కథ రీత్యా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగనుందట. అయితే ఆ సీన్స్ ప్రేక్షకుడిని ఎంతో ఆకట్టుకోవడంతో పాటు త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల హృదయానికి తాకుతాయని అంటున్నారు. వాస్తవానికి త్రివిక్రమ్ సినిమాల్లో మంచి కామెడీ, ఫన్నీ పంచ్ డైలాగ్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి.అయితే ఈ సినిమాలో ఇవి మరింత ఎక్కువగా ఉన్నట్లు టాక్. ఇక ఈ విషయమై పలువురు నెటిజన్లు, ఇలా అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ ప్రేక్షకులను అలరించడం కష్టమే అని అంటున్నారు.

కాగా దీనిపై పలువురు సినిమా విశ్లేషకులు స్పందిస్తూ, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్నవి నిజమే అనేది మనకు తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే అని, కాబట్టి ఈ పుకార్లను బన్నీ ఫ్యాన్స్ పెద్దగా లక్ష్య పెట్టవలసిన అవసరం లేదని అంటున్నారు. ఒకవేళ అది నిజమే అయినా, ఆకట్టుకునే విధంగా ఎమోషనల్ సీన్స్ తో సాగిన ఎన్నో సినిమాలు గతంలో సక్సెస్ అవ్వలేదా అని కూడా గుర్తుచేస్తున్నారు…..!!