ఇలియానా ఘాటు ఫోటో.. బికినీలో అన్నీ చూపెట్టేసిందిగా..!

దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ను పలకరించిన ఇలియానా.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన ఒళ్లో వేసుకుంది. పోకిరి సినిమాతో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుని టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అప్పట్లోనే కోటి రూపాయల పారితోషకం తీసుకునే భామగా రికార్డులకెక్కింది.రెండు చిత్రాలతోనే ఎంతో ఫేమ్ తెచ్చుకున్న ఈ గోవా సుందరి.. తెలుగులో ఒకప్పుడు ఊపు ఊపింది. నడుము ఒంపులతో కుర్రకారు గుండెల్ని గిలిగింతలు పెట్టింది. జీరో సైజ్ అనే పదాన్ని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసింది. తన అందాలతో ఇలియానా.. అందర్నీ ఆకట్టుకుంది.మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి చిత్రంలో శ్రుతి క్యారెక్టర్లో జీవించేసింది. ఈ సినిమాలో తన అందంతో అందర్నీ మాయ చేసింది. ఇక పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన జల్సా చిత్రంలో మరోసారి అందర్నీ ఆకట్టుకోగా.. కిక్ చిత్రంతో ఇక్కడి ఆడియెన్స్ ను మరోసారి మెప్పించింది.

ఇక్కడ తెచ్చుకున్న ఫేమ్ ను వాడుకుని.. ఇలియానా బాలీవుడ్ కు చెక్కేసింది. అయితే అక్కడ అనుకున్నంతగా రాణించలేకపోయింది. బర్ఫీ చిత్రంతో మంచి హిట్ అందుకున్నా.. కూడా ఆమెకు ఉపయోగపడలేదు. ఇక్కడ ప్లస్ అయినా ఆమె అందం అక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఎన్ని అవకాశాలు వచ్చినా.. సరైన గుర్తింపు మాత్రం పొందలేకపోయింది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన రుస్తుమ్ కూడా తనకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు.అయితే చాలా గ్యాప్ తరువాత ఇలియానా ఓ తెలుగు సినిమాను ఒప్పుకుంది. అది కూడా రవితేజ చేసిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో. అయితే అప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమాలుండగా.. మరోసారి జతకట్టారు. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో తిరిగి టాలీవుడ్ వైపు చూడలేదు.ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రూ నీబోన్ తో చెట్టాపట్టాలేసుకుని ఇలియానా తిరిగింది. ఆమె అందాలను తన కెమెరాలో అతను బంధించగా..వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుండేది. ఆ సమయంలో ఎక్కడ చూసినా వీరిద్దరి ఫోటోలే కనబడేవి. అయితే ఏమైందో తెలియదు గానీ.. వీరిద్దరి ప్రేమ బంధానికి అంతలోనే ఎండ్ కార్డ్ పడింది.

వెంటనే తన సోషల్ మీడియా ఖాతాలో ఉన్న ప్రియుడి ఫోటోలను డెలీట్ చేసేసింది.తన అందం ఏ మాత్రం తగ్గలేదని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇలియానా ఆత్రుతగా ఉన్నట్లు కనిపిస్తోంది. బికినీ ఫోటోను షేర్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఈ ఫోటోలో ఓ విశిష్టత ఉంది.. చూపించాల్సిన మొహాన్ని దాచేసింది.. దాచేయాల్సిన అందాలను చూపిస్తోంది. అదే మరి లౌక్యం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.