సౌత్ రాష్ట్రాలన్నిటికి భారి విరాళం ప్రకటించిన ఇళయ దళపతి విజయ్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నారు అనే చెప్పాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకొని వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక కరోనా పై పోరాడడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే చెప్పాలి. అంతేకాకుండా క్వారైంటన్ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు.. వైద్య రంగంకి సంబంధించిన పరికరాలను కూడా అంద చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి చాలా ఖర్చు అవుతుందనే చెప్పాలి.

దీనితో ఈ పోరాటంలో భాగంగా సినీ తారలు కూడా వారి వంతు సహాయం అందజేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అలాగే దేశంలో ఉండే అన్ని పరిశ్రమలు నుంచి చాలామంది నటీనటులు వారి వంతు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయాలను అంద చేస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కేంద్ర ప్రభుత్వానికి, వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు మొత్తం 1.30 కోట్లు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రానికి 5 లక్షలు అందజేయడం జరిగింది.అంతేకాకుండా ప్రధానమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయలు. ఇక తమిళనాడు సహాయనిధికి 50 లక్షలు, కేరళ సహాయనిధి 10 లక్షలు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్ర సహాయ నిధులకు 5 లక్షల రూపాయలుగా ప్రకటించాడు. దీనితో పాటు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సహాయ నిధికి కూడా 25 లక్షల దాకా సహాయం అందజేయడం జరిగింది. కేవలం తమిళనాడు సహాయనిధికి మాత్రమే కాకుండా దక్షిణాదిలో అన్ని రాష్ట్రలకు సహాయ నిధులకు విరాళాలు అందజేయడం దళపతి ప్రత్యేకతే అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం అన్ని రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి.

ఇక విజయ్ దళపతి హీరోగా మాస్టర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కరోనా వైరస్ రాకపోయి ఉంటే ఈ సినిమాని విడుదల చేసి ఉండేవారు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయం పూర్తి అయిన తర్వాత సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాను మన తెలుగులో మహేష్ కోనేరు విడుదల చేస్తున్నారు అని సమాచారం. ఈ సినిమాని ఖైదీ ఫేమ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.