ఇలాంటివి ఎవరైనా నమ్ముతారా..? శ్రీముఖిపై షాకింగ్ రూమర్స్

ఈసారి జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబడిన మొదట్లోనే టైటిల్ శ్రీముఖి ఫిక్స్ చేసుకుందని వార్తలు బయటకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఆ వార్తల్లో ఎంత వరకు నిజముందో ఆమెకే తెలియాలి కానీ ఒక్క మాట మాత్రం నిజమే అని చెప్పాలి.తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు మాత్రం ఖచ్చితంగా టైటిల్ విన్ అవ్వడానికి తన సోషల్ మీడియా విభాగాలు అన్నిటిని అలెర్ట్ చేసి ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో చేయించుకున్నారు.ఇదొక్కటేనా అసలు తెలుగు బిగ్ బాస్ హౌస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ కు కూడా జరగని స్థాయి ప్రమోషన్స్ శ్రీముఖికి జరిగాయి అని షో రెగ్యులర్ ఫాలోవర్స్ ఆశ్చర్యపోయారు.

ఏకంగా థియేటర్స్ లో కూడా ఆమెకు ఓట్ చెయ్యాలని కోరుతూ ప్రకటనలు ఇవ్వడం వంటివి మైండ్ బ్లాక్ చేసాయి.ఇలాంటివి చేసుకోవడం వలనే ఇప్పుడు శ్రీముఖిపైన కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అదేమంటే బిగ్ బాస్ టైటిల్ విన్నవ్వడానికి అంట శ్రీముఖి ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టిందట..అసలు ఇలాంటి ప్రచారం చేస్తున్నవారు ఎందుకు ఒక్క క్షణం ఆలోచించలేకపోతున్నారో అర్ధం కావట్లేదు.శ్రీముఖి తన ప్రచారాల కోసం ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ టైటిల్ కొడితే వచ్చేది 50 లక్షలు దానికి తోడు ఆమెకు వచ్చే రెమ్యునరేషన్ కూడా వస్తుంది.సరే టైటిల్ శ్రీముఖియే కొట్టింది అనుకుందాం..ఇక్కడ నాగార్జునే 5కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు.ఇక్కడ శ్రీ గెలిచిన 50 లక్షలు రెమ్యునరేషన్ గరిష్టంగా 50 లక్షలు ఇస్తారో ఇవ్వరో జస్ట్ అనుకుందాం.

ఈ కోటి రూపాయల కోసం ఇంకో కోటి ఖర్చు పెట్టి కేవలం 50 లక్షల కోసం ఆరాటపడుతుంది అని ప్రచారం చెయ్యడం ఎంత వరకు సమంజసం?చేతిలో బిగ్ బాస్ టైటిల్ ఉందిఅని పేరుకే కానీ ఇప్పటి దాకా మొదటి రెండు సీజన్ల విన్నర్స్ ఎక్కడున్నారో తెలీదు కదా సరైన ఆఫర్స్ కూడా లేవు.అలాంటపుడు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారు ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.