ఫిదా సినిమాలో హీరోగా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా?

మెగా హీరో వరుణ్ తేజ్ ,సాయి పల్లవి నటించిన ఫిదా గత ఏడాది విడుదల అయ్యి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరకి తెలిసిందే .శేఖర్ ఖమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి .ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు గాను మంచి ప్రశంసలు దక్కించుకుంది .సాయి పల్లవిది కేరళ అయ్యినప్పటికి తెలంగాణ యాసలో మాట్లాడి అందరిని ఆకట్టుకుంది .ఫిదా సినిమా హిట్ కావడంతో తెలుగు లో ఆమెకు వరుస అవకాశాలు క్యు కట్టాయి .

ప్రస్తుతం శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి .వరుణ్ తేజ్ కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గ నిలిచింది ఆ చిత్రం .అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తి విషయాలు బయటకు వచ్చాయి .ఫిదా’ సినిమాలో మొదటగా మహేష్ బాబును హీరో గా అనుకున్నారట. మహేష్ కి కొన్ని కారణాల కారణంగా కుదరలేదు. అప్పుడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు సలహా మేరకు ఆ అవకాశం వరుణ్ తేజ్ కి వచ్చింది అంట .కాగా ఈ సినిమా టీమ్ సాయి పల్లవి కోసం ఆరు నెలలు వేచి ఉండాల్సి వచ్చింది అంట .ఆమె డాక్టర్ కోర్స్ పూర్తి అయిన తరువాత వచ్చి ఈ సినిమా చేసింది అంట .తక్కువ ఖర్చుతో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్లను మాత్రం గట్టిగ రాబట్టింది .