సూర్యతో సినిమా చేసి అతి పెద్ద తప్పు చేసా..? నయనతార సంచలన వ్యాఖ్యలు

హీరో సూర్య నటించిన చిత్రం “గజని”. అసిన్, నయనతారలు హీరోయిన్లుగా నటించగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే, ఈ చిత్రంలో నటించి తాను చాలా పెద్ద తప్పు చేశానని నయనతార ఇపుడు వాపోతోంది.ఇందులో నయనతార చిత్ర పాత్రలో నటించింది. 2005లో విడుదలైన ఈ చిత్రంలో తాను పోషించిన పాత్రపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.అందులో నటించడంపై ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డానని చెప్పారు.’ఈ సినిమాలో నా పాత్ర,


ఆసిన్ నటించిన కల్పన పాత్రతో సమానంగా ఉంటుందని అనుకున్నాను కానీ, అలా లేదు’ అని నయనతార చెప్పుకొచ్చింది.మరోవైపు, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో బిజీగా ఉంటూ లేడీ అమితాబ్‌గా కొనసాగుతున్న నయనతార… ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’లో నటించారు. ఈ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకున్నారు.తాజాగా ఆమె ‘దర్బార్’ చిత్రంలో హీరోయిన్‌గా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.