హుందాయ్ న్యూ ఎలక్ట్రికల్ కార్.. ధరెంతో తెలిస్తే మతిపోతుంది

సౌత్ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ హుందాయ్ మోటార్స్ నుంచి కొత్త ఎలక్ట్రికల్ SUV కారు వచ్చేసింది. ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రికల్ వేరియంట్ కొనా(Kona)ను హుందాయ్ మంగళవారం (జూలై 9)న లాంచ్ చేసింది. గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ దగ్గర నిర్వహించిన ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. ఇండియాలో కొనా ఎలక్ట్రికల్ కారు ఒక వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియా ఎక్స్ షోరూం ప్రకారం రూ.25.30లక్షల వరకు ధర పలుకుతోంది. హుందాయ్ ఇండియన్ పొర్టుపొలియోలో వచ్చిన టక్సన్ మోడల్ కారు కొనా కంటే ధర ఎక్కువగానే ఉంది. హుందాయ్ నుంచి వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ SUV కారుగా Kona.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా డిజైన్ చేశారు.

ఇండియాలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరగాలని ఆకాంక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆశించిన స్థాయిలో దేశంలోకి కొత్త ఎలక్ట్రికల్ వాహనాలను రూపొందిస్తున్నారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఎలక్ట్రికల్ వాహనాలపై వినియోగదారులకు ఆసక్తి పెంచేందుకు తక్కువ వడ్డీతో కార్ల లోన్లు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రికల్ SUV కారు రోడ్డుపైకి హుందాయ్ నుంచే రాబోతుంది. అన్ని కొత్త కొనా బ్రాండ్ అందించే అడ్వాన్స్ డ్ టెక్నాలజీ తో ఎకో అండ్ క్లీన్ మొబిలిటీ, యూత్ ఫుల్ డిజైన్ ఆఫర్ చేస్తోంది. స్పోర్టీ డ్రైవింగ్, అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో ఫస్ట్ లాంగ్ రేంజ్ గ్రీన్ SUVను ఆఫర్ చేస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్లు వరకు దూసుకెళ్లే కేపాసిటీ ఉంది. కొనా ఎలక్ట్రిక్ పరిమాణం కొలతలు 4.2మీటర్ల వరకు పొడువు ఉంటుంది. విశాలమైన 5 సీట్లు కాన్ఫిగిరేషన్ ఉంది. సన్ రూఫ్ కూడా ఉంది. వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్ అప్ డిస్ ప్లే, టచ్ స్ర్కీన్, ఎంటర్ టైన్ మెంట్ సౌండ్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. హుందాయ్ కొనా బ్యాటరీని మూడు రకాలుగా ఛార్జ్ చేసుకోవచ్చు. బేసిక్ ఛార్జర్ ప్లగ్స్ తో కన్వెన్షనల్ ప్లగ్ పాయింట్ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే 19 గంటల వరకు వస్తుంది.

AC స్టాండ్ వాల్ మౌంటెడ్ ఛార్జర్లతో బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు వరకు పనిచేస్తుంది. కొనా ఎలక్ట్రానిక్ SUV కారు మూడు ఏళ్ల స్టాండర్డ్ వారెంటీతో వస్తోంది. అదనంగా రెండేళ్ల పాటు పొడిగింపు ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ స్టాండ్ అలోన్.. ఎనిమిదేళ్ల వారెంటీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రికల్ వాహనాలపై GST 12శాతం నుంచి 5శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.