వామ్మో.. ఆ నలుగురికి చుక్కలు చూపించిన హైపర్ ఆది

ఈటీవీ నుంచి తెలుగు ప్రేక్షకులను మరింత అలరించే షోలలో “క్యాష్” ప్రోగ్రాం కూడా ఒకటి.సుమ వ్యాఖ్యాతగా నిర్వహించే ఈ షోకు సంబంధించిన వచ్చే వారపు ప్రోమో యూట్యూబ్ లో విడుదలయ్యి అద్భుత రెస్పాన్స్ రాబడుతుంది.సీనియర్ నటి హేమ,యాంకర్ గీత మరియు మేఘన లతో కలిసి హైపర్ ఆది చేసిన రచ్చ మాములుగా లేదు..మొత్తం నలుగురు ఆడవాళ్ళలో ఆది ఒక్కడే ఉన్న ఎంటర్టైన్మెంట్ మాత్రం మళ్ళీ 100% ఇచ్చేసారు.మొదటగా జెనరేషన్స్ వారీగా ఒక్కొక్కరి ఏజ్ ను “సామజవరగమన” సాంగ్ తో పోల్చి చెప్పడం ఒకెత్తు అయితే సుమ వచ్చి ఆది చేతులు పట్టుకొని అతని రియల్ ఏజ్ ను చెప్పడం హైలైట్ గా పేలింది.

అలాగే సుమ అడిగిన ఒక ప్రశ్న అయితే ఆదిని బాగా ఇరకాటంలో పడేసింది.నాగబాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి బాస్కెట్ బాల్ ఛాలెంజ్ విసిరారు.ఆ బాల్ కానీ బాస్కెట్ లో పడకపోతే సమాధానం చెప్పాల్సిందే.కానీ ఆది వేసిన బాల్ మాత్రం ఆ వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది.దీనితో కవర్ చేసుకోడానికి ఆది ఆ వెనుక కూడా ఏదో నెట్ ఉన్నట్టుంది లేదా అని అన్న మాటలు హిలేరియస్ గా పేలాయి.అయితే సుమ అందరికి కలిపి సూదిలో ఎవరు ముందు దారం ఎక్కిస్తారో వాళ్ళు ఒక కాయిన్ వేసుకోవచ్చని చిన్న టాస్క్ ఇచ్చారు.దానితో ఆది అందుకొని అక్కడున్న లేడీస్ ను ఉద్దేశించి ఇప్పుడు తెలిసిపోద్ది అసలు ఏజ్ అంటూ వేసిన పంచ్ అదిరిపోయింది.ఇలా ఆది అంతమంది ఆడవాళ్ళలో సోలోగా ఉన్నా సరే అదరగొట్టేసాడు.ఇప్పుడు ఈ ప్రోమో కూడా 24 గంటలు దాటక ముందే 1 మిలియన్ మార్క్ దగ్గరకు వెళ్ళిపోతుంది.ఈ ఫుల్ ఎపిసోడ్ వచ్చే నవంబర్ 16 శనివారం రాత్రి 9:30 నిమిషాలకు మీ ఈటీవీలో ప్రసారం కానుంది.