బిగ్ బాస్ లో శ్రీముఖి మొత్తం ఎంత తీసుకుందో తెలిస్తే షాకవ్వాల్సిందే..? రాహుల్ కన్నా ఎక్కువ

బిగ్ బాస్ 3 సీజన్ ముగిసింది. ఫైనల్ విజేతగా రాహుల్ నిలువగా, రన్నరప్‌గా బుల్లితెర యాంకర్ శ్రీముఖి నిలిచారు. అయితే, శ్రీముఖి భారీ రెమ్యూనరేషన్‌ రూపంలో ఇంటికి తీసుకువెళ్లిందనే ప్రచారం సాగుతోంది. ఆమె అందానికి ఫిదా అయిన నిర్వాహకులు ఆమె అడిగినంత సమర్పించుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా శ్రీముఖి సత్తా చాటుతోంది. అలాగే, బిగ్ బాస్ హౌస్‌లోనూ అద్భుత నటనను ప్రదర్శించింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు రోజుకు రూ.లక్ష డిమాండ్‌ చేసినట్టు సమాచారం.

ఆమె పాపులారిటీకి ఫిదా అయిన నిర్వాహకులు షోకు సైన్‌ చేసేముందు పునరాలోచన లేకుండా ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది. అలా, 105 రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి కొనసాగడంతో కాంట్రాక్టు ప్రకారం రూ.1.05 కోట్ల చెక్‌ ఆమె అందుకున్నట్టు సమాచారం. బిగ్ బాస్ 3 టైటిల్ విజేత రాహుల్‌ సహా ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే ఆమె రెమ్యూనరేషన్‌ చాలా అధికం కావడం గమనార్హం.కాగా, 14 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్‌బాస్‌ తెలుగు 3 హౌస్‌లో అడుగుపెట్టిన శ్రీముఖి ఏకంగా 105 రోజుల పాటు హౌస్‌లో కొనసాగడంతో పాటు టాప్‌ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. గ్రాండ్‌ ఫినాలేలో టైటిల్‌ను రాహుల్‌ సిప్లీగంజ్‌ ఎగరేసుకుపోవడంతో ఆమె రన్నరప్‌గా మిగిలారు.