హీరో రాజశేఖర్ కు ఘోర రోడ్డు ప్రమాదం.ఆయన రియాక్షన్ ఇదే..?

నటుడు, హీరో రాజశేఖర్ కారు ప్రమాదం నుండి ప్రాణాలతో బయట పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం లో రాజశేఖర్ క్షేమం గానే వున్నారని సమాచారం. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా కారు టైర్ పగిలి డివైడర్ ని ఢీకొని, కారు పల్టీలు కొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులోని ఎయిర్ బాగ్స్ సరైన సమయానికి తెరుచుకోవడం తో ప్రమాదం నుండి బయట పడ్డారు.

ఈ ప్రమాదం లో హీరో రాజా శేఖర్ తో పాటుగా కారులో మరొక వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన తరువాత రాజశేఖర్ మరొక కారులో వెళ్లిపోయారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. ఇటీవల గరుడ వేగా సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్, కల్కి చిత్రం తో పర్వాలేదనిపించారు. వరుస ప్లాప్ చిత్రాలతో గతం లో ఫెయిల్యూర్ అయిన రాజశేఖర్ మళ్ళీ కెరీర్ ని చక్కదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని రాజశేఖర్ సమర్ధించారు.