హీరో నుండి సరికొత్త మోడల్.. ఇండియాలోనే మొట్టమొదటిది

భారత మార్కెట్లో BS6 కంప్లయింట్ ఇంజిన్ల తయారీ మొదలైంది. మోటార్ సైకిల్స్ కంపెనీలు కూడా ఇదే తరహా కొత్త ఇంజిన్లతో మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. హీరో మోటోకార్పొరేషన్ కంపెనీ తమ లేటెస్ట్ మోడల్ తీసుకొస్తోంది. భారత మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన Splendor మోటార్ సైకిల్ లేటెస్ట్ మోడల్ ఇది.అదే.. Hero Splendor iSmart బైక్. భారత తొలి BS6 కంప్లయింట్ మోటార్ సైకిల్ కూడా కావడం విశేషం. బీఎస్-VI కంపైలన్స్ తో కూడిన ఈ కొత్త బైక్ ఫ్యుయల్ ఇంజెక్షన్ తో వచ్చింది. దీని ధర ఢిల్లీలో (ఎక్స్-షోరూం) రూ.64వేల 900గా కంపెనీ నిర్ణయించింది.

ఈ బైక్ ఫీచర్లలో ఇంధన సమర్థత కోసం ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ లేదా i3S సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ బైక్ డిజైన్ పూర్తిగా హీరో మోటోకార్పొరేషన్ కంపెనీ డెవలప్ చేసింది. మార్కెట్లో రిలీజ్ అయ్యే మోడల్ ఇంజిన్లతో అనేక అప్ గ్రేడ్ మోడల్స్ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.కంపెనీ ప్రకారం.. గత మోడల్ కంటే.. స్ప్లెండర్ ఐస్మార్ట్ FIపై కొత్త BS-VI ఇంజిన్.. 10 శాతానికిపైగా టార్క్యూ ఎట్రాక్టీవ్ గా ఉంది. 15mm సస్పెన్షన్ పెరగగా, వీల్ బేస్ 36mm పెరిగింది. కొత్త డైమండ్ ఫ్రేమ్ ద్వారా మోటార్ సైకిల్ ఎంతో స్థిరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. Splendor iSmart FI బైక్.. రెడ్, బ్లాక్, టెక్నో బ్లూ, బ్లాక్, ఫోర్స్ సిల్వర్, హెవీ గ్రే కలర్లు ఉన్నారు. రెండు వేరియంట్లలో సెల్ఫ్ డ్రామ్ క్యాస్ట్, సెల్ఫ్ డిస్క్ క్యాస్ట్ మోడల్స్ ఉన్నాయి.

స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే : Fi స్లాండ్.. 9 bhp @7500 rpm, 9.89 Nm torque @ 5500 rpm, 110cc BS6 కంప్లయింట్, ఫ్యుల్ ఇంజెక్టడ్ ఇంజిన్, 240mm డిస్క్ బ్రేక్ (ఫ్రంట్)
130mm డ్రమ్ బ్రేక్ (రియర్-బ్యాక్), 80/100-18 ట్యుబ్ లెస్ టైర్స్, 116 కిలోలు, స్పోర్ట్స్ 9.5 లీటర్ (ఫ్యుయల్ ట్యాంక్)