హీరోగా వివి వినాయక్.. రెమ్యూనిరేషన్ ఎంతో తెలిస్తే షాకే..?

వీవీ వినాయక్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రెండు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఘనతను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆది’, ‘దిల్’, ‘ఠాగూర్’, ‘బన్నీ’, ‘లక్ష్మీ’, ‘అదుర్స్’, ‘నాయక్’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అదించాడు. దీంతో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల స్థాయికి చేరుకున్నాడు.దర్శకుడిగా సక్సెస్ అయిన వినాయక్.. త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెరకెక్కించబోయే సినిమాలో వీవీ వినాయక్ హీరోగా పరిచయం కాబోతున్నారు. దీన్ని ఇరువురూ ప్రకటించేశారు కూడా. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయకుడిగా పనిచేసిన ఎన్‌ నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో వినాయక్‌‌ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే దీని కోసం ఆయన కొద్దిరోజులుగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. హీరోగా పరిచయం అవుతున్న నేపథ్యంలో వినాయక్ తాజాగా కొన్ని కామెంట్స్ చేశాడు. ‘స్లిమ్‌ అవ్వడానికి, ఫిట్‌గా కనిపించడానికి ఏదో ఒక కారణం కావాలి. హీరోగా కనిపించాలంటే ఇవన్నీ ఉండాలి.

ఫిట్‌నెస్‌ కోసమే సినిమా చేస్తున్నా. పెద్ద హీరో అయిపోవాలని కాదు’ అని చెప్పుకొచ్చారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోగా చేస్తున్నందుకు వినాయక్ రూ. 9 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.