ఒక్క దెబ్బతో మారిన హరితేజ కేరీర్.. ఇలా అవుతుందని అస్సలు ఊహించి ఉండరు

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అ ఆ’ మూవీలో సమంత సహాయకురాలుగా హరితేజ నటించిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఆమె నటించిన ఏసినిమాకు రానంత పేరు ఆ మూవీలోని ఆపాత్ర ద్వారా ఆమెకు వచ్చింది. ఈ మూవీ తరువాత ఆమెకు అనేక సినిమాలలో అవకాశాలు వచ్చాయి.అంతేకాదు ఆమె ‘బిగ్ బాస్’ షోలో పాల్గొని టాప్ 5 కంటెస్టంట్స్ స్థాయికి వెళ్ళడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగి అనేక బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ చేసే స్థాయికి ఎదిగి పోయింది. ఇలాంటి పరిస్థితులలో ఆమె కూడ మూడు కోట్లు విలువచేసే ఒక విల్లాను కోటి రూపాయలు విలువచేసే ఒక ఖరీదైన కారును కొనుక్కున్నాను అంటూ ఆమె ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈమధ్యనే తన ఇంటి గృహప్రవేశం కూడ పూర్తి చేసుకున్నాను అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్త పరుస్తోంది.

దీనితో హరితేజ సంతోషాన్ని చూసిన కొందరు ఆమె పై జోక్స్ వేస్తున్నారు. హరితేజ మొదటిగా కృతజ్ఞతలు చెప్పుకోవలసింది ఆమెకు ఈ స్థాయికి తీసుకువచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అని గుర్తు చేస్తూ గురూ జీని మర్చిపోయావా అంటూ జోక్ చేస్తున్నారు.త్రివిక్రమ్ తన సినిమాలకు సంబంధించి ఎంచుకునే నటీనటులకు ఆ సినిమాలతో విపరీతమైన పాపులారిటీ వస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడో మర్చిపోయిన నదియాను పవన్ అత్తగా మార్చి ఆమె స్థాయిని పెంచాడు. ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న టబు ను ‘అల వైకుంఠపురంలో’ కీలక పాత్రలో చూపించబోతున్నాడు. ఇలా ఇండస్ట్రీ మర్చిపోయిన ఎందరికో లైఫ్ ఇవ్వగల సామర్ధ్యం త్రివిక్రమ్ కు ఉండే కాబట్టే ఈ మాటల మాంత్రికుడు సినిమాలలో చిన్న పాత్ర వచ్చినా చాలు అంటూ చాలామంది ప్రముఖ నటీ నటులు త్రివిక్రమ్ పిలుపు కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు..