గుత్తా సీక్రేట్ డేటింగ్.. బర్త్ డే సాక్షిగా దొరికిపోయిన యంగ్ హీరో..!

గత కొంత కాలంగా హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా లవ్వాయణం గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. డిమోంటీ కాలనీ.. రాక్షసన్ చిత్రాల కథానాయకుడు.. తమిళ హీరో విష్ణు విశాల్ తో గుత్తా జ్వాలా డేటింగ్లో వున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఏడాది కాలంగా డేటింగ్ రూమర్లు వస్తున్నా దానిని మాత్రం కన్ఫామ్ చేయడం లేదు. ఇన్ని రూమర్స్ నడుమ ఈ వీకెండ్ బర్త్డే పార్టీలో హంగామా చేసింది ఈ జోడీ. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా పుట్టిన రోజు కావడంతో ప్రత్యేకంగా ఆమె కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు హీరో విష్ణు విశాల్. ఆమె కోసం ఓ స్పెషల్ రింగ్ ని గుత్తా జ్వాలకు బహుమతిగా ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న విష్ణు విశాల్ ఈ వీకెండ్ హైదరాబాద్ లో బర్త్డే గర్ల్ గుత్తా జ్వాలా.. ఇతర ఫ్రెండ్స్ తో గడిపానని ట్వీట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదివరకే పెళ్లైన విష్ణు విశాల్ మనస్పర్థల కారణంగా తన భార్య రజనీ నటరాజ్ నుంచి విడిపోయాడు. అప్పటి నుంచి అతనిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.తాజాగా రింగ్ ను కానుకగా ఇవ్వడం ద్వారా ఆ రూమర్ ని నిజం చేస్తున్నట్టేనా? అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు జ్వాలా ఫ్యాన్స్. గుత్తా జ్వాలాతో డేటింగ్లో వున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పేసి బర్త్ డే పార్టీలకు హాజరవుతున్నాడని విష్ణు ఫ్యాన్స్ లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ గా మారుతోంది. జెర్సీ తమిళ రీమేక్ లో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నారు. హీరో రానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.