వంటికి గాయాలైనప్పుడు ఇలా చేయండి

పనులు చేసేటప్పుడు మనకు తెలియకుండానే కాళ్ళకు-చేతులకు ఎక్కడో ఒక చోట దెబ్బలు తగులుతుంటాయి. కాసేపైనాక నొప్పి తెలుస్తుంది.తగిలిన దెబ్బ పెద్దదై నొప్పి అధికంగావుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. దెబ్బ చిన్నదైతే చిట్కాలను అవలంబించండి.దెబ్బ తగిలిన వెంటనే అర చెంచా పసుపును పాలలో కలిపి త్రాగండి. దీంతో లో దెబ్బలకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. గాయాలపాలైనప్పుడు వాపు లేదా ఎముక విరిగినట్లైతే ఆ ప్రాంతంలో రుద్దకూడదు. దీంతో ఎలాంటి ప్రయోజనంకలగకపోగా దుష్ఫలితాలు అధికంగా ఉంటాయని వైద్యులు సూచించారు.

దెబ్బ తగిలిన చోట తొలుత బ్యాండ్ ఎయిడ్ వాడండి. వాపు కలిగిన చోట బాధను తగ్గించడానికి, వాపును తగ్గించడానికి గంటకోసారి ఐస్ ముక్కను పెట్టండి లేదా నీటితో తడిపిన పట్టీలను ఉంచండి. దీంతో నొప్పి, వాపు తగ్గుతాయి.ప్రస్తుతం ఇక్కడ ఇచ్చిన చిట్కాలు, చిన్న-చిన్న గాయాలు, వాపులకుమాత్రమే. విపరీతమైన గాయాలు అయితే వెంటనే వైద్యులను సంప్రదించండి.