గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్.. నానీకి గట్టి దేబ్బేసిందిగా..?

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నానికి ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. తన నటనలో ఎప్పుడు కొత్తదనం చూపిస్తూ..లేని పోని బిల్డప్ లు ఏమీ చూపించకుండా మన పక్కింటి కుర్రాడిలా నటిస్తూ తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న నాని ఈ యేడాది ‘జెర్సి’ లాంటి ప్రయోగాత్మక మూవీతో అభిమానుల ముందుకు వచ్చాడు. క్రీడా నేపథ్యంలో ఉన్న ఈ మూవీకి సెంటిమెంట్ తోడు కావడంతో సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో స్టార్ దర్శకులు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటించారు. ఐదురు ఐదు వయసుల ఆడవారు..ఓ రివేంజ్ స్టోరీ, దానికి తోడు కామెడీ,థ్రిల్ ఇలా అన్ని సమపాళ్లలో ఉండటంతో ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది.

దాంతో ఈ మూవీ తొలి వారాంతంలో డీసెంట్ గా పెర్ఫర్మ్ చేసింది. దీంతో ఒక వారం ఇలాగే కొనసాగితే మూవీ సేఫ్ అయిపోవడం ఖాయం అనుకున్నారంతా. కాకపోతే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది..హిట్ టాక్ వచ్చినా..సోమవారం నుండి చిత్ర కలెక్షన్స్ లో హ్యుజ్ డ్రాప్ కనిపించింది. ఇప్పటివరకూ ఈ మూవీ ఐదు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల 60 లక్షలు వసూలు చేసింది.రేపు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ రిలీజ్ కాబోతుంది..ఈ మూవీ హిట్ టాక్ వస్తే గనక ‘గ్యాంగ్ లీడర్ ’ పై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. పంచవ్యాప్తంగా గ్యాంగ్ లీడర్ బిజినెస్ 30 కోట్లకు జరిగిన విషయం తెల్సిందే. మరో రెండు రోజుల్లో వాల్మీకి విడుదల కానున్న నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ బయ్యర్లకు నష్టాలు తీసుకురావడం ఖాయంలా కనిపిస్తోంది.
ఏరియా వైజ్ గా గ్యాంగ్ లీడర్ షేర్

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 5.54

సీడెడ్ 1.71

నెల్లూరు 0.43

కృష్ణ 1.04

గుంటూరు 1.11

వైజాగ్ 1.84

తూర్పు గోదావరి 1.18

పశ్చిమ గోదావరి 0.75

షేర్ మొత్తం 13.60