వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ రెండు వారాల కలెక్షన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్.. మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం విడుదలైనా తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం మూడో వారంలో కూడా అజేయంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం.. బాక్సాఫిసు వద్ద తన సవ్వడి బాగానే చేస్తోందని సినీ విశ్లేషకులు పేర్కోంటున్నారు.వరణ్ తేజ్ నటనను మరో స్థాయికి తీసుకువెళ్లిన గద్దలకొండ గణేష్ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జిగర్తాండ చిత్రానికి రిమేక్.

అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని నటించిన ఈ చిత్రాన్ని తెలంగాణ యాసలో దర్శకుడు హరీష్ శంకర్ అద్బుతంగా రూపోందించారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు చేస్తోంది. వరణ్ తేజ్ సినీ కెరీర్ లో అత్యధిక లాభాలను అర్జించిందీ చిత్రం.తాజాగా వెల్లడైన గణంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఏకంగా 20.98 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. నైజాంలో రూ.7.78 కోట్లు, సీడెడ్ లో రూ 3.42 కోట్లు, నెల్లూరు రూ. 0.89 కోట్లు, క్రిష్ణ రూ. 1.51 కోట్లు, గుంటూరు రూ. 1.90 కోట్లు, వైజాగ్ రూ.2.49 కోట్లు, తూగో రూ.1.57 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 1.42 కోట్లతో మొత్తంగా 20.98 కోట్ల షేర్ రాబట్టింది.