వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..?

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన లేటెస్ట్ మూవీ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వాల్మీకి). రిలీజ్‌కు కేవ‌లం ఆరు గంట‌ల ముందే వాల్మీకి టైటిల్ కాస్త గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ గా వ‌రుణ్ న‌ట‌న‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వ‌ద్ద ఫైన‌ల్ ర‌న్‌లో రూ .25.15 కోట్ల థియేట్రికల్ వాటాను వసూలు చేసింది. గద్దలకొండ గణేష్ యొక్క థియేట్రికల్ హక్కులు రూ .25 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఇక ఈ సినిమా ఫైన‌ల్ వ‌సూళ్లు, ప్రి రిలీజ్ బిజినెస్‌తో కంపేరిజ‌న్ చేస్తే అన్ని ఏరియాల్లోనూ బ‌య్య‌ర్లు సేఫ్ అయ్యారు. వాస్త‌వానికి ఈ సినిమాకు టాక్ బాగున్నా హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు, ఏపీలో వ‌ర్షాలు వ‌సూళ్ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపాయి. దీంతో అనుకున్న రేంజ్ కంటే వ‌సూళ్ల కాస్త త‌గ్గాయ‌నే చెప్పాలి. ఇక వ‌రుణ్ తేజ్‌కు ఇది వ‌రుస‌గా మ‌రో హిట్ ఇచ్చింది. ఇప్ప‌టికే సంక్రాంతికి వ‌చ్చిన ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత మ‌రో క్లాసిక్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం జిగర్తాండకు రీమేక్‌గా తెర‌కెక్కిన‌ ఈ మాస్ ఎంటర్టైనర్లో అధర్వ మురళి, పూజా హెగ్డే మరియు మృనాలిని రవి ఇతర కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో) :

నైజాం – 8.74

సీడెడ్ – 3.45

ఉత్త‌రాంధ్ర – 2.66

ఈస్ట్ – 1.61

వెస్ట్ – 1.51

కృష్ణా – 1.42

గుంటూరు – 1.83

నెల్లూరు – 0.89
————————————–
ఏపీ + తెలంగాణ = 22.11 కోట్లు
————————————–

రెస్టాఫ్ ఇండియా – 1.96

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 1.08
———————————————–
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 25.15 కోట్లు
———————————————–