ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూ.1 కే బంపర్ డీల్స్

కొత్తగా ఏదైనా కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఆగండి. అదిరిపోయే డీల్స్ మీ కోసం వేచిచూస్తున్నాయి. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఇందులో వివిధ రకాల ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ-కామర్స్ విభాగంలో తీవ్రమైన పోటీ నడుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మధ్య రసవత్తరమైన పోటీ కొనసాగుతోంది. ఇరు కంపెనీల్లో ఒకటి ఒక సేల్ ప్రకటిస్తే.. మరొకటి కచ్చితంగా మరో సేల్‌ను ప్రకటిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి.

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను ఆవిష్కరించింది. ఇది జూలై 15న ప్రారంభమౌతుంది. అయితే కంపెనీ ఇప్పటికే ఆఫర్లు ఎలా ఉంటాయో చెప్పడానికి టీజర్‌ మాదిరి ఒక పేజ్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఎలాంటి డిస్కౌంట్లు ఉండబోతున్నాయో తెలియజేసింది.ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్ససిరీస్, ఫ్యాషన్, ఫర్నీచర్, బ్యూటీ, టాయ్స్, స్మార్ట్‌ఫోన్స్ ఇలా వివిధ రకాల ప్రొడక్టులపై అదిరిపోయే డీల్స్ సొంతం చేసుకోవచ్చు.టీవీలు అండ్ హోమ్ అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససిరీస్‌పై ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. దుస్తులు, చెప్పులు, ఫర్నీచర్ వంటి ప్రొడక్టులపై 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.

ఇక బుక్స్, టాయ్స్, స్పోర్ట్ వంటి ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఇక స్మార్ట్‌ఫోన్స్‌పై మునుపెన్నడూలేని డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే గ్రాసరీపై రూ.1 డీల్స్ ఉంటాయని పేర్కొంది. సేల్‌లో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు కూడా ఉండనున్నాయి.