సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ అదరగోట్టాడుగా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో రిలీజ్ అయిన ప్రతి చోట అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.మహేష్ యాక్షన్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి టేకింగ్ తోడు కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లపై దండయాత్ర చేశారు.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందని చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్‌ను పెద్ద ఎత్తున నిర్వహించారు.కాగా ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందనే అంశంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.మహేష్ స్టామినాకు ఏమాత్రం తగ్గకుండా సరిలేరు నీకెవ్వరు చిత్రం ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.98.60 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది.ఈ వీకెండ్‌‌ ముగిసే సరికి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు సినీ జనం.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

 

నైజాం – 26.30 కోట్లుసీడెడ్ – 11.50 కోట్లు

గుంటూరు – 8.16 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 7.75 కోట్లు

ఓవర్సీస్ – 9.50 కోట్లు

వైజాగ్ – 12.00 కోట్లుఈస్ట్ – 8.18 కోట్లు

వెస్ట్ – 5.16 కోట్లు

నెల్లూరు – 3.02 కోట్లు

కృష్ణా – 6.60 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.81.37 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.98.62 కోట్లు