ఫైటర్’ ని పూరి అలా ప్లాన్ చేస్తున్నాడా..!!

‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’, ‘కేజీఎఫ్’, ‘సాహో’.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలుగా బాక్సాఫీస్ వద్ద స్టామినా చాటిన సినిమాలు.. కథలో సత్తా ఉంటే ఒక్క భాష అని హద్దులు పెట్టలేం. ఇప్పుడు కథలన్నీ హద్దులు దాటుతున్నాయి. ప్రస్తుతం దర్శకులందరూ పాన్‌ ఇండియా సినిమాలపై దృష్టిపెడుతున్నారు.డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కూడా ఓ పాన్‌ ఇండియా మూవీ ప్లాన్‌ చేశారు. విజయ్‌ దేవరకొండతో ‘ఫైటర్‌’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు పూరి.

చార్మితో కలసి ఈ సినిమాను నిర్మిస్తారాయన. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.హిందీ వెర్షన్‌కు కరణ్‌ జోహార్‌ భాగస్వామిగా వ్యవహరించనున్నారట. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ కథలో విజయ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తారట. దీనికి సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన పూరి.. ‘ఫైటర్’ కోసం యమ హుషారుగా పనిచేస్తున్నాడని సమాచారం.