మరోకసారి కలవనున్న ఎవర్ గ్రీన్ జోడి

తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేక ట్రెండ్ ని సెట్ సేసిన హీరో పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ కెరీర్ లో మంచి క్రేజ్ ని తెచ్చిన చిత్రం ఖుషి . యస్.జె.సూర్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ కు కొత్త స్క్రీన్ ప్లే ను పరిచయం చేసింది. ఇందులో భూమిక తన గ్లామర్ తో పాటు మంచి అభినయాన్ని మేళవించింది. ఖుషి సినిమాలో పవన్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం ఉన్నందున ఆ అభిరుచిని ఈ సినిమాలో మేళవించాడు.ఖుషి మూవీ అప్పటి ఆడియన్స్ ని ఉర్రుతలూగించింది.ఆ సినిమాలో పవన్ హెయిర్ స్టైల్ అండ్ కాలేజీ బాగ్ అంతా కూడా కుర్ర కారుని ఆకట్టుకున్న విషయాలు.

ఖుషి సినిమాతో కొత్త డైలాగ్ డెలివరీ కి శ్రీకారం చుట్టాడు పవన్ కళ్యాణ్. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు భూమిక మధ్య జరిగే సంభాషణ అత్యద్భుతం. డైరెక్టర్ యస్.జె.సూర్య పవన్ కళ్యాణ్ ను డిఫరెంట్ లుక్ లో చూపించే ప్రయత్నం చేశాడు. ఇండస్ట్రీ లో ఖుషి మూవీ ఓ అద్భుతం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మని శర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, భూమిక గ్లామర్ అప్పటి యువతని పిచ్చెక్కించాయి. పవన్ కళ్యాణ్ సత్తాని బాక్సాఫీస్ కు తెలియజేసిన చిత్రం ఖుషి. అప్పట్లో ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది.అయితే సుదీర్ఘ రాజకీయాల అనంతరం మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. హిందీలో హిట్ అయినటువంటి పింక్ ను తెలుగులో లాయర్ సాబ్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో సృతి హాసన్ నటిస్తున్నట్లు సమాచారం.

పవన్ ఈ సినిమా తరువాత క్రిష్ డైరెక్షన్లో ఓ పీరియాడిక్ సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ బందిపోటులా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు సమాచారం. అయితే పవన్ కి జోడిగా భూమిక అయితే బాగుంటుందని క్రిష్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడట. పవన్ కళ్యాణ్ కి కూడా ఈ నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. ఇదే నిజమైతే మరో సరి పవన్ కళ్యాణ్ మరియు భూమిక జంట ఈ సినిమాలో హైలైట్ అవుతుంది . ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇదే నిజమైతే ప్రేక్షకులకు పండగే పండగా …