నేను హీరోయిన్ ను అందుకే కాలేదు.. యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

అందం అభినయం వున్న యాంకర్ శ్యామల హీరోయిన్ ఎందుకు కాలేదో వివరాలను తెలిపింది. యాంకర్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు తెచ్చుకున్న శ్యామల హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదు అని చెబుతుంది. అంతే కాకుండా నేను సక్సెస్ ని రుచి చూస్తున్నా అది ఇంకా పూర్తీ కాలేదని అంటోంది శ్యామల. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నన్ను ఫ్యాన్స్ ఇంతలా ఆదరిస్తుంటే చాల సంతోషంగా వుంది అని పేర్కొంది.

అయితే సినిమా హీరోయిన్ కావాలంటే చాలా రెస్పాసిబిలిటీ ఉండాలి, గ్లామర్ షో కోరుకుంటారు. దానిని నేను మైంటైన్ చేయలేను అని చెప్పేసింది అంతేకాదు, హీరోయిన్ ని చూడగానే భలేగా వుంది అనేట్లు ఉండాలి. నేను అందంగా వున్నా నాకు తిండి నిద్ర బాగా కావాలి అంటూ చెప్పేసింది. అయితే హీరోయిన్ గా రాణించాలంటే ఈ రెండిటిని త్యాగం చేయాలి, అది నా వాళ్ళ కాదు.అందులో నాకు హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదు, ఒక వేళ సినిమాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేస్తాను కానీ, సినిమాల్లో హీరోయిన్ గా నటించను అని తేల్చి చెప్పేసింది.