కళ్యాణ్ రామ్ కొత్త సినిమా `ఎంత మంచివాడవురా ` స్టోరీ లైన్ ఇదేనా..?

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన చివరి హీట్ మూవీ “పటాస్”.ఈ నాలుగు సంవత్సరాలలో హీట్ సినిమా కోసం చేయని ప్రయత్నం లేదు. 2018లో తమిళ దర్శకుడు జయేంద్రతో తీసిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “నా నువ్వే” సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన “118” కూడా కల్యాణ్ రామ్ కు విజయాన్ని తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న తో ఒక సినిమాని చేస్తున్నాడు.

ఈ సినిమాకి ఎంత మంచివాడవురా అనే పేరును ఖరారు చేశారు.రీసెంట్ గా ఈ సినిమా సంక్రాంతి కి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కి సంబంధించిన ఒక అప్ డేట్ అందరిని ఆశ్వర్యపరుస్తుంది.ఈ సినిమా కి 2018లో గుజరాత్ లోవచ్చిన “ఆక్సిజన్” అనే సినిమా స్ఫూర్తి అని ఇన్ సైడ్ టాక్. . ఈ సినిమాలో హీరో అందరికి సహయం చేస్తాడు. ఈ జీవితం ఇతరులని ప్రేమించడానికి అని నమ్మే వ్యక్తి.
కొన్ని సార్లు కనీసం పరిచయం లేని వ్యక్తులకు సహయం చేయడానికి ఎంత సాహసమైన చేస్తాడు.

అన్షుల్ త్రివేది హీరోగా చిన్మయ్ పురోహిత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా గుజరాత్ లో ఘనవిజయం సాధించింది. కానీ సినిమా నిడివి కొంచం ఎక్కువగ ఉందని విమర్శలు వచ్చాయి.. మన ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుందనే నమ్మకంతో సతీష్ వేగ్నేశ దీనికి చాలా కీలకమైన మార్పులు చేసుకున్నట్టు తెలిసింది. దర్శకనిర్మాతలు ఇది రీమేక్ అని చెప్పలేదు కాబట్టి ఇది అధికారికంగా ధృవీకరించలేం.ఈ సినిమా సతీష్ వేగేశ్న కి కూడా చాలా కీలకం .సతీష్ దర్శకత్వంలో నితిన్ హీరో గా నటించిన శ్రీనివాస కళ్యణం ఘోరపరాజయం అయ్యింది.అందువల్ల ఈ సినిమాను జాగ్రత్తగా తీస్తున్నాడు.