ఇంత దారుణమా…? జబర్దస్త్ నటిని రూమ్‌కు రమ్మన్న బడా దర్శకుడు

జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా.. జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడుతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధలు కూడా తెలుసు. ఇప్పుడు సాయితేజ కూడా ఇదే చెప్పింది. ఒకప్పుడు చాలా స్కిట్స్ చేసిన సాయితేజ.. లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయ్యాడు.

ఆ తర్వాత ఏకంగా అమ్మాయిగానే మారిపోయాడు. ఆపరేషన్ చేయించుకుని సాయితేజ కాస్తా ప్రియాంకగా పేరు మార్చుకున్నాడు ఈయన.సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత తనను కూడా చాలా మంది వేధించారని.. ఇష్టమొచ్చినట్లు విమర్శించారని గుర్తు చేసుకున్నాడు సాయితేజ. ఈ మధ్యే ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టింది ప్రియాంక. వినోద్‌పై దాడి గురించి కూడా మనసులో మాట బయటపెట్టాడు ఈ జబర్దస్త్ మాజీ కమెడియన్. ఇంటి కొనుగోలు విషయంలో ఓనర్ చేతిలోనే దాడికి గురయ్యాడు వినోద్. అసలు వాడిపై దాడి చేసిన వాళ్లు మనషులే కాదు.. మృగాలు అంటూ మండిపడింది ప్రియాంక.

ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతుంది ప్రియాంక. ఇక ఇప్పుడు కూడా తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతుంది ఈమె. ఈ మధ్యే తనకు ఓ దర్శకుడు ఫోన్ చేసి నువ్వు నా సినిమాలో ఐటం సాంగ్ చేస్తావా అని అడిగాడని.. వెంటనే తాను కూడా చేస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ప్రియాంక. అయితే ఆ పాటలో ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తుందని చెప్పాడని దానికి కూడా ఓకే అన్నట్లు చెప్పింది ప్రియాంక. పెద్ద హీరోయిన్లే చేస్తున్నపుడు తానెందుకు చేయనని చెప్పింది ఈమె.ఈ పాటను వరంగల్‌లో షూట్ చేయాల్సి వస్తుందని.. అక్కడే మూడ్రోజులు ఉండాలని చెప్పాడని చెప్పింది ఈమె. అన్నీ సర్దుకుని తాను కూడా వరంగల్ షూట్ కోసం బయల్దేరుతున్న సమయంలో అదే దర్శకుడు కాల్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడాడని చెబుతుంది ప్రియాంక. తనతో మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని.. ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది. దాంతో తను మీ రూమ్‌లో ఎందుకుండాలి.. ఫ్రెండ్స్‌తో పాటే ఉంటానని.. తాను అలాంటి దాన్నైతే ఈ రోజు ఎక్కడో ఉండేదాన్నని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది ప్రియాంక. అన్నీ చెప్పినా తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ దర్శకుడి పేరు మాత్రం చెప్పలేదు ఈమె