ఎక్కడా తగ్గని ప్రభాస్.. కొత్త సినిమాలోనూ అదే రేంజ్

బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేసి ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో కాస్త నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా ‘జాన్‌’పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వస్తున్న అప్‌డేట్స్ ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.మరోవైపు జాన్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణ, హీరో ప్రభాస్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట.అన్ని హంగులతో భారీ రేంజ్ సినిమాగా తీర్చిదిద్ది రెబల్ స్టార్ అభిమానులకు స్పెషల్ మూవీ అందించాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఇందుకోసమై ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణా మూవీస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దాదాపుగా 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 1960 కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. అందుకే భారీ ఎత్తున దాదాపు 25 రకాల సెట్స్‌ను నిర్మించిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఈ సెట్స్ వేస్తున్నారనేది తాజా సమాచారం.డబ్బుకు వెనకాడేదే లేదని, వేసే ప్రతి సెట్ కూడా అద్భుతంగా ఉండాలని నిర్మాతలు చెప్పేశారట. నిర్మాణ విలువలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించి, క్యాస్టింగ్‌కి బడ్జెట్ తగ్గించాలని భావించిన నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఫిలింనగర్ టాక్. చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.