ఈ వారం హిట్టు సినిమా ఏది.. మన్మదుడు, కొబ్బరి మట్ట, కథనం

బాక్సాఫీసు ముందుకు మూడు సినిమాలు వచ్చాయి. నాగార్జున మన్మధుడు2, అనసూయ కధనం, సంపూర్నేష్ బాబు కొబ్బరిమట్ట. ఈ మూడు సినిమాల బాక్సాఫీసు లెక్క ఎలా వుందో చూద్దాం. మన్మధుడు2 సెట్స్ పైకి వెళ్ళినప్పటి నుండే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కూడా అదరగొట్టారు.నాగ్రొమాంటిక్ ఇమేజ్ ని కావల్సినంత వాడేశారు. డానికితోడు ఫ్రెంచ్ నుండి కధ తీసుకొచ్చామని చెప్పారు. అయితే సినిమాకి మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. మొదటి ఆటతోనే ఈ సినిమా జాతకం తేలిపోయింది.

మొదటి ఆటకు వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగా ఓపెనింగ్స్ కూడా బాగా తగ్గిపోయాయి. చెప్పుకొదగ్గ వసూళ్లు సాధించలేకపోయాడు మన్మధుడు. అనసూయ నటించిన ‘కధనం’ పరిస్థితి కూడా ఇలానే వుంది.’రంగస్థలం’తర్వాత అనుసూయకి వెండితెర అభిమానులు కూడా ఏర్పడ్డారు. అందుకే ఆమె నుండి సినిమా వస్తుందంటే కొంత బజ్ ఏర్పడింది. అయితే కధనం విషయానికి వస్తే సరైన పబ్లిసిటీ చేయలేదు. అసలు ఈ సినిమా వస్తుందనే సంగతి కూడా చాలా మందికి తెలియలేదు. దానికి తోడు సినిమాకీ మంచి టాక్ రాలేదు. కధ కధనాలు ఏమంత ఆకట్టుకోలేదు. టోటల్ గా చెప్పుకోదగ్గ టికెట్లు తెగలేదు.హృదయకాలయంతో బర్నింగ్ స్టార్ అయుపోయాడు సంపూర్నేష్ బాబు. అయితే తర్వాత వచ్చిన సింగం 123నిరాశ పరిచింది. చాలా గ్యాప్ తీసుకొని, సినిమా కస్టాలు దాటుకొని ఎట్టకేలకు కొబ్బరిమట్టని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా ఓకే అనిపించింది. హృదయ కాలయంత కాకపోయినా.. టైం పాస్ కి సినిమా అనే టాక్ వచ్చింది. సరదాగా నవ్వుకుందామనుకునే వాళ్ళు కొబ్బరిమట్ట వైపు చూస్తున్నారు. మొదటి రోజు వసూళ్లు కూడా బావున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షలు వసూళ్లు చేసింది. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీసు వీక్ గా వుందనే చెప్పాలి.కొత్తవారానికి రెండు సినిమాలు రెడీగా వున్నాయి. శర్వానంద్ రణరంగం, అడివి శేష్ ఎవరు ? ఈ రెండు సినిమాలపై కూడా మంచి అంచనాలు వున్నాయి. చూడాలి మరి.. ఈ సినిమాల జోరు బాక్సాఫీసు దగ్గర ఎలా వుంటుందో..